నాగవల్లిని ఎందుకు రిలీజ్ చేసారు? సి.కళ్యాణ్ సూటి ప్రశ్న
షూటింగ్ పూర్తి చేసుకున్న తన సినిమా విడుదల సమయానికి ఏ సినిమాలు రిలీజ్ కాకూడదనే నిర్ణయం ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారని బాలయ్యతో పరమవీర చక్రను నిర్మిస్తున్న సి.కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసారు. నాగవల్లి ఎందుకు రిలీజ్ చేసారు..రగడకు ఎలా అనుమతిస్తారు అని ఆయన ప్రశ్నించారు. దీంతో పరిష్కారమవుతున్నట్లుగా కన్పించిన తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షోభం మళ్ళీ మొదటికొచ్చింది. ఫెడరేషన్ సబ్యులతో కో ఆర్డినేషన్ కమిటీ భుధవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సినిమాలు విడుదలకు గతంలో అంగీకరించినా, తాజా పరిస్దితుల నేపధ్యంలో ఇప్పుడు ఏ సినిమాలనూ విడుదల చేయరాదవని ఈ భేటీలో నిర్ణయించారు. కానీ ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. ఇప్పటికే వెంకటేష్ నటించిన నాగవల్లి చిత్రం విడుదల కాగా, నాగార్జున రగడ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్దమైంది. ఇక ఈ రోజు కమల్ హాసన్ నటించిన డబ్బింగ్ సినిమా మన్మధ బాణం విడుదల అవుతోంది.
గొడవకు కారమైన 35 మంది ఫైటర్లలను సస్పెండు చేస్ తీరాల్సిందేనన్న నిర్మాతల డిమాండ్లను ఫెడరేషన్ ససేమిరా అంది. చెన్నైకి చెందిన స్టంట్ డైరక్టర్ శివపై చర్యలు తీసుకోవాలన్న ఏపీ ఫైటర్ల డిమాండ్ కు నిర్మాతలు అంగీకరించకపోవటంతో చర్చలు విఫలమయ్యాయి. దాంతో ఫెడరేషన్ సభ్యులు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న నిర్మాతల మండలి బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. ఇందులో అశ్వనీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, నల్లమలుపు శ్రీనివాస్, నట్టికుమార్, బెల్లంకొండ సురేష్, సురేష్ బాబు, అశోక్ కుమార, సి కళ్యాణ్, వజ్జల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరో వైపు ఫెడరేషన్ సభ్యులతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష్యుడు ధర్మేష్ తివారీ, మాజీ అధ్యక్ష్యుడు తమ్మారెడ్డి భరధ్వాజ, ఫెడరేషన్ అధ్యక్ష్యుడు కోటగిరి వెంకటేశ్వరరావు చర్చలు జరిపారు. దాంతో సభ్యులు శాంతించారు. చెన్నై ఫెడరేషన్ తో కూడా మాట్లాడి కిస్మస్ తర్వాత ఏపీ, చెన్నై ఫెడరేషన్ సభ్యులతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేస్తారని ధర్మేష్ హామీ ఇచ్చారు. షూటింగ్ లు నిలిపి వేయాలన్న నిర్మాతల తొందర పాటు చర్యగా అభివర్ణించారు.


Click it and Unblock the Notifications











