»   » త్రివిక్రమ్ సామర్థ్యం ఏమిటో నిరూపిస్తుంది

త్రివిక్రమ్ సామర్థ్యం ఏమిటో నిరూపిస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అన్ని వర్గాల వారినీ విశేషంగా అలరించేలా ఈ సినిమా రూపొందుతోంది. అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న 'మహేష్ ఖలేజా' మహేష్ కెరీర్‌లోనే గొప్ప సంచలన చిత్రం అవుతుంది. సెప్టెంబర్ 4 నుంచి మిగిలి ఉన్న పాటను అన్నపూర్ణ స్టూడియోస్ ‌లో వేసే సెట్లో తీస్తాం. సెప్టెంబర్ 10లోగా పాటల్నీ, అదే నెలాఖరులో సినిమానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో మహేష్ అద్భుతంగా చేశారు. డైరెక్టర్‌గా త్రివిక్రమ్ సామర్థ్యం ఏమిటోఈ సినిమా నిరూపిస్తుంది" అని నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ తెలిపారు. మహేష్ సరసన హీరోయిన్ గా అనుష్క చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

మహేష్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న 'ఖలేజా' చిత్రం సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్. సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేశ్‌బాబు, సి. కల్యాణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రకాశ్ ‌రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, షఫీ, సుశీల్ శర్మ, సుధ, శ్రీరంజని తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ఎస్. భట్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, కళ: ఆనంద్‌సాయి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: త్రివిక్రమ్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu