twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మీ శ్రేయాభిలాషి' నిర్మాత సీసీ రెడ్డి మృతి

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : చలన చిత్ర నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా వ్యవహరించిన సి.సి.రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి ఇక్కడి బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన వయస్సు 78 ఏళ్లు.

    సి.సి.రెడ్డి కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ.. డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. సోమవారం డయాలసిస్‌ చేయంచుకునేందుకు ఆసుపత్రికి వెళ్లారు. ఆ పక్రియ కొనసాగుతుండగానే... ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

    Producer CC Reddy Passed Away

    సి.సి. రెడ్డి ..గౌతమ్ ఎస్ ఎస్ సి, రూమ్ మేట్స్, మీ శ్రేయాభిలాషి చిత్రాలు నిర్మించారు. 'వెంగళ్‌రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ సొసైటీ'ని సి.సి.రెడ్డి స్థాపించారు. పారిశ్రామికవేత్తగా పేరున్న సి.సి.రెడ్డి విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించారు. అలాగే ఈ భూమి అనే పత్రికను సైతం ఆయన ఎడిటర్ గా నడిపారు. ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు సంతాపం తెలియచేస్తూ... నివాళిలు అర్పిస్తోంది.

    English summary
    Visu Consultancy Chief and film producer CC Reddy has passed away (October 6, 2014) at Care Hospital in Hyderabad. CC Reddy has produced few films Gautham SSC, Roommates and Mee Sreyobhilashi on Visu Entertainments banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X