ఎన్టీఆర్ కోసమే ఆర్తి అగర్వాల్‌ను తీసుకున్నాం.. అతడి వల్లే అలా అయిపోయింది: బయటపెట్టిన తెలుగు నిర్మాత

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. కానీ, వారిలో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని చాలా కాలం ఎఫెక్ట్ చూపించారు. అలాంటి వారిలో ఆర్తి అగర్వాల్ ఒకరు. 'నువ్వు నాకు నచ్చావ్' అనే సినిమాతో హీరోయిన్‌గా వచ్చిన ఆమె.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని హీరోలు అందరితోనూ నటించింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తోన్నప్పుడే ప్రాణాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్తి అగర్వాల్‌పై తెలుగు ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

అలా మొదలైన ప్రయాణం
ఆర్తి అగర్వాల్ 'పాగల్పన్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ వెంటనే 'నువ్వు నాకు నచ్చావ్' ద్వారా టాలీవుడ్‌లోకి వచ్చింది. అప్పటి నుంచి 'నువ్వు లేక నేను లేను', 'ఇంద్ర', 'వసంతం', 'వీడే', 'సంక్రాంతి', 'అందాల రాముడు', 'అల్లరి రాముడు', 'అడివి రాముడు' వంటి హిట్ చిత్రాల్లో నటించి సత్తా చాటుకుంది.

Producer Chanti Addala Reveals Few Facts About Heroine Aarthi Agarwal

చనిపోవాలని సంచలనం

హీరోయిన్‌గా ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పట్లో దీనిపై ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె ఓ హీరోతో ప్రేమాయణం సాగించిందని.. అతడితో వివాదం కారణంగానే సూసైడ్‌కు యత్నించిందని వచ్చిన వార్తలు సంచలనం అయ్యాయి.

పెళ్లి చేసుకుని విడిపోయి
వరుసగా సినిమాలు చేస్తోన్నప్పుడే ఆర్తి అగర్వాల్.. ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు. అయితే, అది జరిగిన రెండేళ్లకే ఈ హీరోయిన్ భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది. కానీ, అందులో కొన్ని సినిమాలు విడుదల కాకుండానే ఆగిపోయాయి.

Producer Chanti Addala Reveals Few Facts About Heroine Aarthi Agarwal

ఆర్తి అగర్వాల్ మరణంతో

చాలా కాలం పాటు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్.. ఆ తర్వాత సినిమాల అవకాశాలు లేకపోవడం, భర్తతో విడాకులు అవడంతో పాటు కొన్ని వివాదాల కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె బరువు తగ్గేందుకు కొన్ని సర్జరీలు కూడా చేయించుకుంది. ఈ క్రమంలోనే 2015 జూన్ 6న గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు.

తారక్ కోసం ఆర్తి అగర్వాల్
ఆర్తి అగర్వాల్ గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్ చంటి అడ్డాల తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'అల్లరి రాముడు సినిమాకి హీరోయిన్‌గా చార్మిని తీసుకున్నాం. ఎన్టీఆర్, ఛార్మి లావుగా ఉంటే కష్టమని ఆలోచించి ఆర్తి అగర్వాల్‌ను తీసుకున్నాం. అలా తను మా బ్యానర్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అడవి రాముడులో ప్రభాస్ కోసం తీసుకున్నాం' అని ఆయన చెప్పుకొచ్చారు.

Producer Chanti Addala Reveals Few Facts About Heroine Aarthi Agarwal

అలా అవడానికి కారణం

ఆర్తి అగర్వాల్ డిప్రెషన్‌కు వెళ్లడానికి కారణం ఆమె తండ్రి అంటూ చంటి అడ్డాల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్తి సెట్స్‌లో చాలా సరదాగా ఉండేది. కానీ, ఆమె తండ్రి వస్తే మాత్రం సైలెంట్ అయ్యేది. ఆయన ప్రభావం ఆమెపై బాగా ఉంది. సినిమాలే కాదు.. కెరీర్‌పైనా ఆయన ఇష్టం వచ్చినట్లే చేసేవారు. అందుకే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్‌లోకి వెళ్లింది' అంటూ బయటపెట్టారు. చంటి అడ్డాల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X