‘సరదా' టైటిల్ పై పవన్ నిర్మాత ఖండన

By Srikanya

హైదరాబాద్ : జల్సా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మళ్లీ నటిస్తూండటంతో ఆ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రానికి టైటిల్ ఇప్పటికి అఫీషియల్ గా ఖరారు చేయలేదు. అయితే 'సరదా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఈ 'సరదా' టైటిల్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్, మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత వీటిని ఖండించారు. ఆ టైటిల్ అసలు కన్సిడర్ చేయలేదని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ...'సరదా' టైటిల్ పెడదామని మేము ఎప్పుడూ అనుకోలేదు. అసలు కన్సిడర్ చేయలలేదు. మేము ఈ చిత్ర కథకి సరిపోయేలా మంచి పొయిటిక్ టైటిల్ పెడదామని నిర్ణయించుకున్నాం. మీడియావారు 'సరదా' టైటిల్ ని హైలెట్ చేయకండి అన్నారు. త్రివిక్రమ్ సైతం గతంలో ఈ టైటిల్ ని ఖండించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యణ్ ఈ చిత్రంలో ఎన్నారై గా కనిపించి అలరించనున్నట్లు సమాచారం. స్పెయిన్ లో ఉండే ఎన్నారై ఇండియా వచ్చినప్పుడు జరిగే కథతో ఆయన తాజా చిత్రం తెరకెక్కుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఎన్నారై గెటప్ లో పవన్ సూపర్బ్ ఉంటాడని, విదేశాల్లో ఉండే అభిమానులు సైతం ఐడింటిఫై చేసుకునేలా కథ,కథనం ఉంటాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఊ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

మరో ప్రక్క ఈ చిత్రంతో బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ దాదాగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా చేస్తున్నారు. 'మిర్చి' చిత్రంలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించిన నదియా ఈ సినిమాలో సమంత తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత చెప్తూ...''ఆద్యంతం సరదాలు పంచే కథ ఇది. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'జల్సా'కి మించిన వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నాం. బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు'' అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. సమంత హీరోయిన్. సహనిర్మాతలు: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, భోగవల్లి బాపినీడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X