twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలో ‘బాహుబలి’ ప్రీక్వెల్... తెలుగు వారికి నిరాశేనా?

    By Bojja Kumar
    |

    రెండు భాగాలుగా వచ్చిన 'బాహుబలి' మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నెన్ని సంచలనాలు సృష్టించిందో ఒక్క మాటలో చెప్పడం కష్టం. భారతీయ సినీ చరిత్రలోనే ఈ చిత్రం ఓ అద్భుతం. విదేశాల్లోనూ వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. వందల కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఎంతో మంది టెక్నీషియన్లు, నటీనటులు కష్టపడితే ఈ భారీ చిత్రరాజం మన ముందుకు వచ్చింది. తెలుగు సినిమా కీర్తి పతాకాలను రెపరెపలాడించింది. హాలీవుడ్ స్థాయిలో తాము సినిమాలు తీయగలమని ప్రతి భారతీయడు గర్వంగా చెప్పుకునే రేంజికి ఈ చిత్రం తీసుకెళ్లిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

    Recommended Video

    Bahubali Had Huge Collections in china To
    త్వరలో బాహుబలి ప్రీక్వెల్

    త్వరలో బాహుబలి ప్రీక్వెల్

    మన ఇప్పటి వరకు ‘బాహుబలి-1' ‘బాహుబలి-2' చిత్రాలు చూశాం. ఈ రెండు చిత్రాల కంటే ముందు కథ ఏమిటి? అనే అంశాలను ఫోకస్ చేస్తూ శివగామి కోణంలో త్వరలో బాహుబలి ప్రీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. . దీనిలో శివగామి చిన్నతనం, మాహిష్మతికి కోడలు కావడం, కట్టప్ప ఎక్కడివాడు? ఎందుకు రాజ్యానికి బానిస అయ్యాడు? అనే అంశాలు ఇందులో ఉంటాయట.

    సినిమా కాదు, ఆన్‌లైన్ సిరీస్ రూపంలో...

    సినిమా కాదు, ఆన్‌లైన్ సిరీస్ రూపంలో...

    అయితే బాహుబలి ప్రీక్వెల్ సినిమా రూపంలో కాకుండా ఆన్ లైన్ సిరీస్ రూపంలో తెచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి నిర్మాత ప్రసాద్ దేవినేని ఈ విషయం వెల్లడించారు

    ప్రభాస్, రానా ఉండరు, అంతా కొత్త వారితో....

    ప్రభాస్, రానా ఉండరు, అంతా కొత్త వారితో....

    ఆగస్టు నుంచి కొత్త నటులతో బాహుబలి ప్రీక్వెల్‌ నిర్మించాలని నిర్ణయించాం. ఇప్పుడున్న మాహిష్మతి సామ్రాజ్యంతోపాటు మరికొన్ని సెట్లు వేస్తున్నాం. మూడేళ్లపాటు చిత్రీకరణ జరుగుతుంది అని ప్రసాద్ దేవినేని తెలిపారు.

    తెలుగు వారికి నిరాశే...

    తెలుగు వారికి నిరాశే...

    ఇంత కాలం బాహుబలి మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకున్నాం. అయితే త్వరలో రాబోయే ప్రీక్వెల్ మాత్రం తెలుగు వారిని నిరాశ పరచనుంది. ఎందుకంటే దీన్ని తెలుగులో తీయడం లేదు. ‘ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆన్‌లైన్‌ సిరీస్‌ రూపంలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నామని ప్రసాద్ దేవినేని తెలిపారు. 192 దేశాల్లో ఒకేసారి లైవ్‌ ప్రసారం అయ్యేలా ఈ సిరీస్ ఉంటుందని తెలిపారు. అయతే దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

    లాభాలు వస్తేనే రెమ్యూనరేషన్ అని రాజమౌళి కమిట్మెంట్

    లాభాలు వస్తేనే రెమ్యూనరేషన్ అని రాజమౌళి కమిట్మెంట్

    శాంతి నివాసం సీరియల్ నుండే తనకు రాజమౌళితో పరిచయం ఉంది. బాహుబలి ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు లాభాలు వస్తేనే రెమ్యూనరేషన్ తీసుకుంటాననే కమిట్మెంటుతో ఆయన ఐదేళ్లపాటు బాహుబలి కోసం శ్రమించారు. ఆ శ్రమకు తగ్గ ఫలితం లభించింది అని ప్రసాద్ దేవినేని తెలిపారు.

    English summary
    Here is a cheerful news for Baahubali fans. One of the producers of Baahuabli, Prasad Devineni, announced that they were planning to make the prequel of Baahubali. In the prequel, they will show, Shivagami's childhood, how Kattappa becomes a slave for Maahishmathi etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X