నిర్మాత డి. సురేష్ బాబు కారు బీభత్సం... చిన్నారితో పాటు దంపతులు తీవ్ర గాయాలు!
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు సికింద్రాబాద్ ఏరియాలో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో పాటు దంపతులకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు ఐపీసీ 337 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంపీరియల్ గార్డెన్స్ సమీపంలో సురేష్ బాబుకు చెందిన టీఎస్09ఈఎక్స్2668 నెంబరు గల కారు రాంగ్ రూట్‌లో వెళుతూ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దంపతులు సతీష్ చంద్ర(35), దుర్గ దేవి(30), సిద్దేశ్ చంద్ర(3)లు గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 10.30 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సతీష్ చంద్ర తన బంధువులను కలిసేందుకు కెపిహెచ్‌బి కాలనీ నుంచి తాడ్‌బండ్ మీదుగా లాలాగుడూ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనపై కార్ఖానా పరిధి పోలీసులు నిర్మాత సురేష్ బాబుకు 41ఏ నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు హాజరు కావాల్సి ఉందని అందులో పేర్కొనట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











