‘గబ్బర్‌సింగ్’రికార్డులు బ్రద్దలు కొడతాం

By Srikanya

హైదరాబాద్ : పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. పద్మాలయాలో వేసిన సెట్ లో ఈ పాటను బారీగా షూట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా పకడ్బందీ స్క్రిప్ట్‌తో, చక్కని జడ్జిమెంట్‌తో జనరంజకంగా పూరిజగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని గురువారం నిర్మాత డీవీవీదానయ్య తెలిపారు.

డీవీవీదానయ్య మాట్లాడుతూ...''ఈ ఏడాది ప్రథమార్ధంలో 'గబ్బర్‌సింగ్'గా పవన్‌కళ్యాణ్ రికార్డులు సృష్టించారు. ద్వితీయార్ధంలో రాబోతున్న ఈ చిత్రంతో ఆ రికార్డులన్నింటినీ ఆయనే అధిగమిస్తారని నమ్మకంగా చెప్పగలను. ప్రస్తుతం పద్మాలయా స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. మిగిలివున్న రెండు పాటలను ఈ నెల 20 లోపు పూర్తి చేస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల మూడోవారంలో విడుదల చేసి, అక్టోబర్ 11న సినిమాను విడుదల చేస్తాం'' అన్నారు.

తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆడియోని మొదట ఈ నెల 21న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వలన ఈ తేదీని కొంచెం ముందుకు జరిపి అంటే ఈ నెల 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. గెస్ట్ గా అనుకున్న చిరంజీవి ఆ రోజు బిజీగా ఉండటంతో చివరి నిముషంలో ఈ మార్పు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ని గ్రాండ్ జరపాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి పవన్ అన్నగారైన చిరంజీవి ఛీప్ గెస్ట్ గా రానున్నారు. గబ్బర్ సింగ్ తర్వతా అన్నదమ్ములు ఇద్దరు మళ్లీ ఒకే స్టేజిపై కనపడనున్నారు.

ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో గేబ్రియేల్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాణం: యూనివర్సల్ మీడియా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X