బయ్యర్లకు దిమ్మతిరిగేలా 'ఆర్ఆర్ఆర్' ఓవర్సీస్ ధర!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ మల్టీస్టారర్‌గా రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచే క్రేజ్ నెలకొంది. బాహుబలితో దేశం దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధం అవుతున్నాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో కథని అందించారు. తాజాగా ఈ చిత్ర బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ బిజినెస్

ఆర్ఆర్ఆర్ బిజినెస్

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రారంభమైన నెలరోజుల్లోపే శాటిలైట్ రైట్స్ విషయంలో నిర్మాతకు భారీ ఆఫర్ వచ్చింది. దాదాపు 150 కోట్లతో ఆర్ఆర్ఆర్ శాటిలైట్ డీల్ కుదిరినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా థియేట్రికల్ బిజినెస్ విషయంలో కూడా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ హక్కులని దక్కించుకునేందుకు బయ్యర్లు వేచి చూస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ రైట్స్ విషయంలో నిర్మాత చెబుతున్న ధర బయ్యర్లకు దిమ్మతిరిగేలా చేస్తోందని టాక్.

ఓవర్సీస్ రైట్స్

ఓవర్సీస్ రైట్స్

ఆర్ఆర్ఆర్ చిత్ర విదేశీ పంపిణి హక్కుల కోసం నిర్మాత 75 కోట్లకు డిమాండ్ చేస్తున్నారట. ఇది నిజంగా కళ్ళు చెదిరే అమౌంట్. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఆ స్థాయిలో ఉంటుంది. రాజమౌళి చిత్రానికి ఎన్టీఆర్, రాంచరణ్ క్రేజ్ కూడా జతకావడంతో ఎంత మొత్తం వెచ్చించి అయినా థియేట్రికల్ హక్కులు దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆకర్షణీయంగా పాత్రలు

ఆకర్షణీయంగా పాత్రలు

సాధారణంగా మల్టీస్టారర్ చిత్రాలపై జనాల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలని రాజమౌళి ఆకర్షణీయంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా, ఎన్టీఆర్ అడవి దొంగగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కీలక షెడ్యూల్

కీలక షెడ్యూల్

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ త్వరలో కోల్‌కతా నగరంలో కీలక షెడ్యూల్‌కి సిద్ధం అవుతోంది. గత ఏడాది నవంబర్‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. కానీ హీరోయిన్లని రాజమౌళి ఇంకా ఫైనల్ చేయలేదు. ఇతర నటుల గురించి కూడా సమాచారం లేదు. ఎన్టీఆర్, రాంచరణ్‌పైనే రాజమౌళి కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. డివివి దానయ్య 300 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X