చిరంజీవి.. నిర్మాత దేవీ వర ప్రసాద్ సీరియస్
చిరంజీవితో చట్టంతో పోరాటం, కొండవీటి రాజా, ఘరానా మొగుడు, అల్లుడా..మజాకా, మృగరాజు వంటి సినిమాలను వరసగా తీసిన ప్రముఖ నిర్మాత దేవీ వర ప్రసాద్ కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. హాస్పటల్ లో చేరినట్లు సమాచారం. అమ్మోనియా లెవిల్స్ పెరగటం, షుగర్ కంట్రోల్ లో లేకపోవటంతో కండీషన్ బాగోక ఆయనను ఐసియు లో పెట్టారు. ప్రస్తుతం కండీషన్ ఫరవాలేదని అంటున్నారు. అయితే సీనియర్ నటులు చలపతిరావు మినహా ఆయనని చూడటానికి గానీ పలకరించటానికి గానీ పరిశ్రమలో వ్యక్తులు వెళ్ళకపోవటం విచారకరం. ఆయన చిరంజీవికి పర్మెనెంట్ నిర్మాతగా ఉన్నా ఎన్టీఆర్ తో కేడీ నెంబర్ వన్, తిరుగులేని మనిషి, నా దేశం వగైరా చిత్రాలు చేసారు. దాసరితో అమ్మ రాజీనామా చేసారు. ఎన్నో సూపర్ హిట్స్ తన కెరీర్ లో ఇచ్చిన ఆయన మృగరాజు ఫెయిల్యూర్ తో క్రుంగిపోయిన ఆయన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఎమ్.ఎస్.నారాయణ దర్శకత్వంలో భజంత్రీలు చిత్రాన్ని నిర్మించారు. అదీ ఫెయిల్యూర్ అయింది. ఆయన ఆరోగ్యం బాగుపడాలని మరెన్ని చిత్రాలు నిర్మించాలని దట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











