ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ చిత్రం ప్రకటన
హైదరాబాద్: "ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించబోయే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని నిర్మాత దేవినేని ప్రసాద్ అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
'శిఖరం' అనే టీవీ సీరియల్‌ను ఆర్కా మీడియా నిర్మిస్తోంది. నాగబాబు, భరణి, షీలాసింగ్, పద్మా చౌదరి, చలపతి ప్రధాన పాత్రధారులుగా ఈ టీవీ సీరియల్ నిర్మాణమవుతోంది. 'శిఖరం' టైటిల్ సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాత ఇలా స్పందించారు. అలాగే నాగబాబు మాట్లాడుతూ "ఆర్కా మీడియా లాంటి సంస్థ టీవీకి, సినిమాకు తప్పకుండా కావాలి. కత్తికి రెండు వైపుల పదునుంటుందన్న చందాన ఈ సంస్థ వ్యవహరిస్తుంటుంది'' అని తెలిపారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చిన 'శిఖరం' సీరియల్‌కు రాధాకృష్ణ దర్శకుడు. త్వరలో రాజమౌళి, ప్రభాస్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నారు.
గతంలో ఛత్రపతి చిత్రంతో ప్రభాస్‌కు భారీ విజయాన్ని అందించిన రాజమౌళి ఈ సారి సరికొత్త కోణంలో యంగ్ రెబల్ స్టార్‌ను చూపెట్టబోతున్నారు. హై ఓల్టేజ్ తో కూడాని యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, డ్రామాతో కూడిన ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయింది. మూవీ లవర్స్‌కి ఈచిత్రం ద్వారా సరికొత్త అనుభూతి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.


Click it and Unblock the Notifications











