రోడ్డు ప్రమాదంలో నిర్మాత దుర్మరణం

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం...సినీ నిర్మాత శ్రీరాం పని మీద నెల్లూరు వచ్చి మళ్లీ చెన్నైకి తిరిగి వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు డివిజన్ లోని చిల్లకూరు రైటార్ సత్రం వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రమాణిస్తున్న ఇండికా కారు ఓ లారీని ఓవర్ టేక్ చేస్తుండగా కారు వెనక భాగం వైపు లారీ ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన కారు బొల్తా కొట్టింది.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కొందరు అక్కడికి చేరుకుని తీవ్ర గాయాలతో ఉన్న మహేష్‌ను ఆసుపత్రికి తరలించారు. నిర్మాత శ్రీరాం మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. అతి వేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఘటన స్థలాన్ని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. చెన్నయ్ నుంచి నిర్మాత శ్రీరాం బంధువులు వచ్చిన తర్వాత అతని మృత దేహాన్ని అప్పగిస్తామని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











