Ram Charan గేమ్ చెంజర్ కోసం మొదట ఆ హీరోను అనుకుంటే.. నేనే వద్దని చెప్పా: దిల్ రాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ కూడా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సినిమా కథకు మొదట దర్శకుడు మరొక హీరోను అనుకున్నారట. అయితే అతను వద్దు అని దిల్ రాజు రామ్ చరణ్ ను ఫిక్స్ చేయించినట్లుగా చెప్పారట. ఆ విషయాన్ని ఆయన ఓపెన్ గా మీడియాకు తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

Producer dil raju about game changer movie director shankar first choice hero

బౌన్స్ బ్యాక్ అయ్యేలా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా గేమ్ చేజర్ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ డైరెక్టర్ శంకర్ చాలా కాలం తర్వాత ఒక పూర్తి కమర్షియల్ సోషల్ ఎలిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

70 శాతం ఫింయ్య: ఈ సినిమా ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని ఒక ఎన్నికల అధికారి క్యారెక్టర్ చుట్టూ సినిమా కథ హైలెట్ అవుతుంది అని ఇండస్ట్రీలో ఇదివరకే ఒక టాక్ వినిపించింది. ఇక నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాను శంకర్ రేంజ్ కు తగ్గట్టుగానే నిర్మిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా ఈ సినిమా ఫినిష్ అయ్యిందని దిల్ రాజు తెలియజేశారు.

Producer dil raju about game changer movie director shankar first choice hero

అవి నిజం కాదు: అయితే దర్శకుడు శంకర్ ఊహించని స్థాయిలో బడ్జెట్ ఖర్చు చేయిస్తూ ఉంటారు అని బడ్జెట్ కొన్ని సార్లు అనుకున్న దాని కంటే ఎక్కువ అవుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక మరోవైపు దిల్ రాజు మాత్రం మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టుబడి సినిమాకు పెట్టరు అనే టాక్ కూడా ఉంది. ఇక ఈ ఇద్దరికి మధ్య కొన్నిసార్లు గట్టిగానే గొడవలు అయ్యాయి అన్నట్లుగా కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అందులో నిజం లేదు అని దిల్ రాజు తెలియజేశారు.

మొదట కథ చెప్పినప్పుడు: శంకర్ గారి గురించి ముందే నాకు తెలుసు కాబట్టి ఆయన టేస్ట్ కు తగ్గట్టుగానే ఈ సినిమా ఉండాలి అని ముందే మేము ఫిక్స్ అయ్యాము. మొదట ఇండియన్ 2 సినిమాను నిర్మించాలని అనుకున్నాము కానీ అది వర్కౌట్ కాలేదు. దాని నుంచి నేను తొందరగానే బయటకు వచ్చేసాను. ఇక శంకర్ గారు ఆ తరువాత గేమ్ చెంజర్ కదా నాకు మొదట చెప్పినప్పుడు రామ్ చరణ్ ను అనుకోలేదు.

Producer dil raju about game changer movie director shankar first choice hero

పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు: మొదట కథ చెప్పినప్పుడు ఇలాంటి కథకు పవన్ కళ్యాణ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది అని శంకర్ గారు ఆయన ఆలోచనలు తెలియజేశారు. కానీ నేను మాత్రం అది కరెక్ట్ కాదు అని రామ్ చరణ్ అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చాను. శంకర్ గారు కూడా రామ్ చరణ్ తో మాట్లాడి కథను చెప్పడంతో ఇద్దరికీ బాగా కనెక్ట్ అయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమాను హై లెవెల్ లోనే పాన్ ఇండియాకు తగ్గట్టుగా తెరపైకి తీసుకురావాలి అని ఫిక్స్ అయినట్లుగా దిల్ రాజు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X