మేము ముంబై వెళ్లిపోతే ఎవ్వడితో మాటపడక్కలేదు, అలాంటి సినిమాలెందుకు?: దిల్ రాజు

ఇండస్ట్రీలో నలుగురు బడా ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని, వారికి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే వాదన ఉంది. 'ఆ నలుగురు' పేరుతో తరచూ మీడియాలో సెటైర్లు కూడా పడుతుంటాయి. ఇండస్ట్రీని నాశనం చేస్తున్న దుష్టచతుష్టయం అనే ఒక అపవాదు దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ మీద పడింది.

దీనిపై దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన వర్కింగ్ స్టైల్, ప్రాజెక్టులను చూసి నెగెటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది. దానికి నేనేం చేయను? నా పని నేను హానెస్టుగా చేస్తున్నాను. నా వల్ల అయినంత వరకు చిన్న సినిమాలకు సహాయం చేస్తున్నాను. మొన్న 'హుషారు' రిలీజ్ రోజు సమస్య వస్తే కూడా నేనే సాల్వ్ చేశాను అని దిల్ రాజు తెలిపారు.

కంటెంట్ లేకుండా సినిమా తీసి ఏం లాభం?

కంటెంట్ లేకుండా సినిమా తీసి ఏం లాభం?

నువ్వు తీసే సినిమాలో ఫస్ట్ కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకుండా ఏ సినిమా తీసినా ఉపయోగం లేదు. గతవారం మూడు చిన్న సినిమాలు వచ్చి చూడమంటే వెళ్లి చూశాను. అందులో విషయం కొంచెం ఉంది. సినిమా ఆడటానికి ఆ విషయం సరిపోదు. అది అర్థం చేసుకోకుండా సినిమాలు తీస్తున్నారు. ‘పెళ్లి చూపులు' 1.50 కోట్లలో తీశారు.. వర్కౌట్ కాలేదా? చిన్న సినిమా అయినా సరే మంచి కంటెంట్ ఉండాలి..

సినిమా బావుంటే థియేటర్లు ఇస్తాం

సినిమా బావుంటే థియేటర్లు ఇస్తాం

ప్రతి ఒక్కరూ నాకు అక్కడ థియేటర్ కావాలి, ఇక్కడ థియేటర్ కావాలి అంటాడు. ఎందుకు? అన్ని థియేటర్లు? ముందు నీ సినిమా జనాలు చూడలి కదా... సినిమా బావుంటే థియేటర్లు పెరుగుతాయి. ఆర్ఎక్స్ 100 ఫంక్షన్లో ఇదే చెప్పాను. సినిమా టాక్ బాగా రావడంతో సెకండ్ డే ఆ చిత్రానికి చాలా థియేటర్లు ఇచ్చాం.

మేము వెళ్లి ముంబైలో సెటిలైతే ఎవ్వడితో మాటపడక్కలేదు

మేము వెళ్లి ముంబైలో సెటిలైతే ఎవ్వడితో మాటపడక్కలేదు

తెలంగాణలో 400 థియేటర్లు ఉన్నాయి. నాకు 4 థియేటర్లు ఉన్నాయి. ఏషియన్ సునీల్, సురేష్ బాబు కలిపి 120 ఉన్నాయి. మిగతా సింగిల్, డబల్ థియేటర్లు కలుపుకుంటే మరో 50 ఉంటాయి. మల్టీప్లెక్సులు వచ్చాయి. వాటికి రూల్స్ బాంబే నుంచి ఉన్నాయి,. వాటి విషయంలో ఏమీ చేయలేం. మల్టీప్లెక్స్ యాజమాన్యం తొలి వారం 52 పర్సంటేజ్, సెకండ్ వీక్ 45%, 3వ వారం నుంచి 35% ఇస్తారు. వారిలాగా మేమంతా వెళ్లి బాంబేలో సెటిలైతే మమ్మల్ని ఎవ్వడూ ఏమీ అనడు. అక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతుంది.

దిల్ రాజును ఎందుకు అంటున్నారు? అనే క్వశ్చన్ మీడియా వారు వేయాలి

దిల్ రాజును ఎందుకు అంటున్నారు? అనే క్వశ్చన్ మీడియా వారు వేయాలి

ఈ సమస్యను పరిష్కరించడానికి చాలా సార్లు ట్రై చేశాం. మీడియాకు, సొసైటీకి, గవర్నమెంటుకు ఇవన్నీ అవసరం లేదు. సొసైటీకి అసలు అవసరం లేదు. మీడియా వారధి కాబట్టి వారు, వీరు అన్న ఆరోపణలతో ప్రోగ్రామ్స్ చేస్తారు. మీడియా వారు వారితో మాట్లాడించే ముందు మీ వద్ద అనాలసిస్ ఉండాలి. నా వద్ద 40 థియేటర్లే ఉన్నాయని చెప్పాను, దిల్ రాజును ఎందుకు అంటున్నారు? అనే క్వశ్చన్ మీడియా వారు వేయాలి.

మీడియా కూడా అవగాహన లేకుండా ప్రవర్తిస్తోంది.

మీడియా కూడా అవగాహన లేకుండా ప్రవర్తిస్తోంది.

మీడియా కూడా అవగాహన లేకుండా ప్రవర్తిస్తోంది. థియేటర్ల ఓనర్లు ఎందుకు లీజ్ వైపు వెళుతున్నారు? వాళ్ల ప్రాబ్లం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోవాలి. సంక్రాంతి అయిపోయింది. ఫిబ్రవరి, మార్చి లో థియేటర్లు మొత్తం లాస్. సినిమాలు లేవు. మళ్లీ సమ్మర్లో సినిమాలు వస్తాయి. జూన్, జులైలో మళ్లీ సినిమాలు తగ్గిపోతాయి. మళ్లీ లాస్... మళ్లీ దసరాకు బావుంటాయి. ఈ అనాలసిస్ మీ వద్ద గ్రౌండ్ నుంచి ఉండాలి. గ్రౌండ్ లెవల్ రియాలిటీ లేకుండా ఫిల్మ్ నగర్లో జరుగుతున్న దాని గురించి మీడియాలో కేవలం రేటింగ్స్ కోసం రచ్చ చేస్తుంటారు.

అలాంటి సినిమా తీసి ఏం లాభం?

అలాంటి సినిమా తీసి ఏం లాభం?

ఆడియన్స్ దగ్గరకు వెళ్లని సినిమాను తీసుకుని నాకు థియేటర్లు కావాలంటే ఉపయోగం ఏముంది? నువ్వు ఎంచుకుంటున్న కంటెంట్ ఏమిటి? ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ కావాలి. ఒక్కో సినిమా ప్రమోషన్ ఖర్చు రూ. 1 కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. నువ్వు 2 కోట్లలో సినిమా చేసి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టే స్థాయి లేనపుడు ఎందుకు సినిమా తీయడం. సినిమా ఆడుతుందా? లేదా? తెలియకుండా కేవలం సినిమా తీయాలని తీయడం.. థియేటర్లు ఇవ్వడం లేదని బ్లేమ్ చేయడం సరికాదని దిల్ రాజు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X