ఆ వివాదంలోకి లాగకండి.. హర్ట్ అయి ఉంటే క్షమించండి: దిల్ రాజు

Dil Raju Apologizes: "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ప్రమోషన్స్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ, 'ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం' అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కొంతమంది దిల్ రాజు వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలంగాణ వాళ్లను తిండిబోతులు, తాగుబోతులా చిత్రీకరిస్తున్నారంటూ తెలంగాణ ప్రముఖులు, నేతలు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తూన్నారు. ఈ తరుణంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు క్షమాపణలు చెబుతూ వీడియోని రిలీజ్ చేశాడు.

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. 'విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈవెంట్ ను నిజామాబాద్ లో నిర్వహించామని, ఇలాంటి సినిమా ఈవెంట్లు నిజామాబాదులో జరగడం మొదటి సారి అని పేర్కొన్నారు. గతంలో ఫిదా సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఈవెంట్ ను నిర్వహించామని, అందుకు కారణం నిజామాబాద్ తో తనకున్న అనుబంధమేనని పేర్కొన్నారు దిల్ రాజు.

Producer Dil Raju Apologizes On Telangana Culture Comments and clarified the ongoing issue

అయితే ఈవెంట్లో తాను తెలంగాణ కల్చర్ లోని దావత్ గురించి ప్రస్తావించానని, మటన్ తెల్లకల్లు గురించి సంబోధించాలని పేర్కొన్నారు దిల్ రాజు. అయితే.. ఆ వ్యాఖ్యల వల్ల తాను తెలంగాణ సంస్కృతిని అవమానించానని, , ప్రజలను హేళన చేశానని, తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ, తన ఉద్దేశం తెలంగాణ ప్రజలను అవమానించాలని గానీ, ఇతరులను హేళన చేయాలని కాదని పేర్కొన్నారు. తాను అలా మాట్లాడానికి గల ఉద్దేశమేంటో.. ఆ స్పీచ్ చివర్లో చెప్పానని పేర్కొన్నారు దిల్ రాజు.

తాను తెలంగాణ కల్చర్ దావత్ ను మిస్ అవుతున్నానని, సంక్రాంతికి తన రెండు సినిమాలు విడుదలవుతున్నాయని, ఆ సినిమాలు హిట్ అవుతే తెలంగాణ కల్చర్ లో దావత్ చేసుకోవాలని ఉందని స్పష్టంగా పేర్కొన్నానని దిల్ రాజు తెలిపారు. తాను తెలంగాణ వాసినేనని, తెలంగాణ కల్చర్ను ఎంతగానో అభిమానిస్తాననీ వెల్లడించారు. కానీ, దాని అర్థం చేసుకోకుండా.. తనపై ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఆ మాట వల్ల ఎవరైనా హర్ట్ అయినా వారి మనోభావాలు దెబ్బతిన్న తనని క్షమించమని కోరుకున్నారు.

Producer Dil Raju Apologizes On Telangana Culture Comments and clarified the ongoing issue

తాను తెలంగాణ పై అభిమానంతోనే బాన్సువాడలోనే 'ఫిదా' చిత్రాన్ని తెరకెక్కించాననీ, ఆ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం అయ్యేలా చేశామని గుర్తు చేశారు. అలాగే.. 'బలగం' సినిమాతో తెలంగాణలోని అనుబంధాలను చూపించామనీ, ఆ సినిమాను సమాజం మొత్తం ఆదరించిందనీ, . అన్ని రాజకీయ పార్టీలు 'బలగం' చిత్రాన్ని అభినందించాయని గుర్తుకు చేశారు. తెలంగాణ వాసిగా తాను ఏవిధంగా ఈ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలను ఎలా హేళన చేస్తానని ఎలా అనుకున్నారో తనకు అర్థం కావడం లేదని, మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి అని పేర్కొన్నారు దిల్ రాజు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X