సినిమా కంటే.. తెల్లకల్లు, మటన్ ముక్కలు ఉంటే చాలు.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
Dil Raju: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇటీవల అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా నియమించింది. ఇకపోతే.. ప్రస్తుతం 'గేమ్ చేంజర్', 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాల ప్రమోషన్స్ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా 'సంక్రాంతి వస్తున్నాం' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు వ్యాఖ్యలు మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే..?
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలుసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు తెరకెక్కయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ హిట్ కాంబోలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే 'సంక్రాంతి వస్తున్నాం'. విక్టరీ వెంకటేష్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.

సూపర్ హిట్ కాంబోలో వస్తున్న సినిమా కోసం టాలీవుడ్ మూవీ లవర్స్ , ఫ్యాన్స్ ఈగర్ గా వేచి చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, సాంగ్స్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
అలాగే ఈ సినిమా నుండి తాజా విడుదలైన ట్రైలర్ కు కూడా ఊహించని రీతిలో స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ వేదికగా 'సంక్రాంతి వస్తున్నాం' సినిమా లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ భారీ ఈవెంట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే.. తెలంగాణలో కళ్ళు మటన్ కు వైబ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే... ప్రొడ్యూసర్ దిల్ రాజు మైక్ పట్టుకోగానే.. 'సార్.. స్పీచ్ మామూలుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలి' అంటూ యాంకర్ శ్రీముఖి కామెంట్ చేసింది. దీంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తెలంగాణ యాసలో రెచ్చిపోయాడు. 'ఏం దావత్ చేసుకుందాం.. చలికాలం చెట్లలకు పోదామా.. అంటూ సినిమాలకు తెలంగాణ ఆడియెన్స్ పెద్ద గా వైబ్ ఇవ్వరు అంటూ కామెంట్ చేశారు.
వెంకటేష్‌కి ఈ విషయాన్ని చెబుతూ.. మా నిజామాబాదులో మటన్, తెల్లకల్లు ఫేమస్.. పొద్దున పూట నీరదాగితే వేరే లెవెల్ లో ఉంటుంది. తెలంగాణ ఆడియెన్స్ సినిమాలపై అంతా ఇంట్రెస్ట్ ఉండదు.. అదే..ఆంధ్ర కెళ్తే సినిమాకు ఓ స్పెషల్ వైబ్ ఇస్తారు. మన దగ్గర తెల్లకల్లుకు, మటన్ కు వైబ్ ఇస్తారు' అంటూ దిల్ రాజు కామెంట్స్ చేశారు.
నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటే వెంటపడతారని మాట్లాడిన దిల్ రాజు pic.twitter.com/5W2AOhgDWG
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
ప్రస్తుతం దిల్ రాజు స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన వైబ్ గురించి మాట్లాడినా, దాని మీనింగ్ మాత్రం రాంగ్ వేలోనే వెళ్తుంది. దిల్ రాజు వ్యాఖ్యలపై కొందరు నెటిజెన్లు కామెంట్స్ , రోల్స్ చేస్తున్నారు. తెలంగాణ ఆడియన్స్ ని అవమానించేలాగా మాట్లాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఓ బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం తగదు అంటూ మండిపడుతున్నారు. ఇలా మొత్తానికి దిల్ రాజు కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











