భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్‌గా మారిన ఫోటో
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మే 10వ తేదీ రాత్రి వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. సతీ వియోగంతో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యుల ఒత్తడి మేరకు రెండో వివాహాన్ని నిజామాబాద్‌లోని ప్రముఖ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం చేసుకొన్నారు. అయితే లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా దిల్ రాజు వివాహానికి అతికొద్ది మాత్రమే ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. అయితే తన భార్యతో దిగిన తొలి సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వివరాల్లోకి వెళితే..

తేజస్వినితో వివాహం
దిల్ రాజు వివాహం వైఘారెడ్డి అలియాస్ తేజస్వినితో ఆదివారం రాత్రి పది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి తర్వాత ఆయన తేజస్వినికి షేక్ ఇస్తూ.. అలాగే మెడలో తాలి కడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు విడుదల చేయగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి.

దిల్ రాజుకు శుభాకాంక్షలు
దిల్ రాజు రెండో భార్య వైఘారెడ్డి పేరును తేజస్వినిగా మార్చారు. జాతకాల ప్రకారం పెళ్లికి ముందే తేజస్విని అనే పేరు ఆమెకు పెట్టారు. దిల్ రాజు కుటుంబ సభ్యులు తేజస్విని సగౌరవంగా ఆహ్వానించారు. పెళ్లికి హాజరుకాకపోయినా దిల్ రాజు దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

కూతురు ఎమోషనల్ పోస్టు
తండ్రి దిల్ రాజు పెళ్లిపై హన్షితారెడ్డి ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నాకు మీరే మానసిక స్థైర్యం, అండ. మీకు ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కుటుంబ విలువకు మీరు ఎంత ప్రాధాన్యం ఇస్తారో నా కంటే ఎవరికి ఎక్కవుగా తెలియదు. మీ చేతి పట్టుకొని నడిచిన అనుభవం, ఆనందం మాటల్లో చెప్పలేను. నాన్న మీ జీవితంలో అనుకోని పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు ప్రారంభిస్తున్న కొత్త జీవితం అద్భుతంగా సాగాలి. మీరిద్దరి మధ్య జీవితం ప్రేమానురాగాలు ముందు కొనసాగాలి. ఇక నుంచి మీ జీవితంలో ప్రతీ రోజు ఓ పండుగలా.. కొత్త అనుభూతితో ఉండాలని కోరుకొంటున్నాను. మీరంటే ఎప్పటికీ చెప్పలేనంత ప్రేమ, ఇష్టం... ఇట్లు మీ హర్షు అంటూ హర్షితారెడ్డి ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు.
Recommended Video

తేజస్వినితో దిల్ రాజు సెల్ఫీ
ఇక కుటుంబ సభ్యులు, కూతురు కోరుకున్నట్లే దిల్ రాజు కొత్త జీవితాన్ని ఆనంద క్షణాల మధ్య ఆరంభించారు. భార్య తేజస్వినితో దిల్ రాజు దాంపత్య జీవితాన్ని అద్భుతమైన అనుభూతుల మధ్య సాగించడం మొదలుపెట్టారు. తాజాగా భార్య తేజస్వినితో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఆయన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరుకొన్నట్లే ఆయన జీవితం అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకొందాం.


Click it and Unblock the Notifications











