చిరు, బాలయ్య, మహేష్, పవన్, జూ ఎన్టీర్ గురించి.. దిల్ రాజు నిజాయితీగా!

వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. హిట్ చిత్రాల నిర్మాతగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన 2019 సంవత్సరంలో టాలీవుడ్ పరిశ్రమకు 'ఎఫ్ 2' రూపంలో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందించారు.

ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సన్నిహితంగా ఉండే దిల్ రాజు... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలువురు స్టార్ హీరోల గురించి తన మనసులోని అభిప్రాయాలను నిజాయితీగా వెల్లడించారు. స్టార్స్ తనతో ఎలా ఉంటారో నిర్మొహమాటంగా తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గురించి

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున గురించి

మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ... ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన ఎంతో మందికి స్పూర్తి ... నాగార్జునలో ఆయన స్మార్ట్‌నెస్ నచ్చుతుందని వెల్లడించారు.

వెంకీ ఒకరే అలా, పవన్ కళ్యాణ్‌కు సిగ్గు

వెంకీ ఒకరే అలా, పవన్ కళ్యాణ్‌కు సిగ్గు

పవన్ కళ్యాణ్ గురించి అడగా... ఆయనది చాలా సిగ్గుపడే మనస్తత్వం, ఇండస్ట్రీలో తనను ‘దిల్' అని పిలిచే ఒకే ఒక్క వ్యక్తి వెంకీటేష్ అని తెలిపారు. వెంకీగారిని నేను చాలా రకాలుగా చూశానని దిల్ రాజు తెలిపారు.

మహేష్ బాబు స్మార్ట్‌గా సెటైర్లు

మహేష్ బాబు స్మార్ట్‌గా సెటైర్లు

మహేష్ బాబు గురించి ప్రశ్నించగా.. ఆయన చాలా స్మార్ట్‌గా సెటైర్లు వేస్తారని తెలిపారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘మహర్షి' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ గురించి

అల్లు అర్జున్ గురించి

అల్లు అర్జున్ చాలా ఎనర్జిటిక్ ఫెల్లో అంటూ... బన్నీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు దిల్ రాజు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో ఆర్య, పరుగు, ఎవడు, డిజె చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఒక్కడే అలా ప్రేమగా..

ఎన్టీఆర్ ఒక్కడే అలా ప్రేమగా..

జూ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించగా... తారక్ ఎప్పుడు కలిసినా అన్నా అని ప్రేమగా పిలుస్తాడని దిల్ రాజు గుర్తు చేసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన బృందావనం సూపర్ హిట్టవ్వగా, రామయ్యా వస్తావయ్యా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ ఏం చేశాడంటే...

రామ్ చరణ్ ఏం చేశాడంటే...

రామ్ చరణ్ గురించి అడగ్గా... నాకు గుర్తుండి పోయేది ఆయన ఇంటికి వెళ్లినపుడు మ్యాంగో, సపోటా ఐస్ క్రీమ్ కలిపి పెట్టాడు. అప్పటి నుంచి నాకు ఆ కాంబినేషన్ ఫ్లేవర్ అలవాటైపోయిందని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

బాలయ్య గురించి

బాలయ్య గురించి

బాలకృష్ణ గురించి దిల్ రాజు మాట్లాడుతూ... నా ఒరిజినల్ పేరు వెంకట రామణారెడ్డి.. నిక్ నేమ్ రాజు. ఆ రెండు కలిపి రాజు రెడ్డి అని నన్ను పిలిచేది కేవలం బాలయ్య మాత్రమే అని తెలిపారు.

ప్రభాస్ గురించి..

ప్రభాస్ గురించి..

ప్రభాస్ గురించి అడ్డగా... ఆయన నా డార్లింగ్ అని చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ రాజు సర్ అని తెలంగాణ యాసలో చాలా ఇంట్రెస్టుగా పిలుస్తాడంటూ ఆయా స్టార్ల మీద తన మనసులోని అభిప్రాయాలను నిజాయితీగా తెలిపారు దిల్ రాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X