Dil Raju: పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు షాకింగ్ రియాక్షన్.. వారితో సంబంధాలు ఉన్నాయంటూ..
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా మంచి సక్సెస్ రేటు ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమా వీలైనంతవరకు నష్టపోకుండా ఉండేలా దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అయితే దిల్ రాజు కు సంబంధించిన కొన్ని వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి కూడా వస్తారు అనే విధంగా కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు తన పొలిటికల్ గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సక్సెస్ అయ్యేలా జాగ్రత్తలు
నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న దిల్ రాజు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కంటెంట్ విషయంలో ఆయన ఆలోచించే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా కథ ఫైనల్ అయినప్పుడే సక్సెస్ అయ్యే విధంగా ముందస్తు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు.

దర్శకత్వంపై క్లారిటీ
ఇక గత 20 ఏళ్ల కాలంలో దిల్ రాజు ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలను నిర్మించిన నిర్మాతలలో దిల్ రాజు ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పవచ్చు. అయితే దిల్ రాజు సినిమాకు దర్శకత్వం కూడా వహించబోతున్నారు అని ఆ మధ్య ఒక టాక్ వినిపించింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని తనది కేవలం ప్రొడక్షన్ వరకే డ్యూటీ అని తెలియజేశారు.

బలగంతో మరో హిట్
ఇక రీసెంట్ గా వచ్చిన బలగం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. DR ప్రొడక్షన్ అనే కొత్త సంస్థను నిర్మించిన దిల్ రాజు దానిని వారి వారసుల చేత మొదలుపెట్టించారు. కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడి కి డబుల్ ప్రాఫిట్స్ అందించింది. ఆ సినిమా సక్సెస్ అవడం చాలా హ్యాపీగా ఉంది అని కూడా దిల్ రాజు తెలియజేశారు.

పాలిటిక్స్ లోకి దిల్ రాజు
అయితే దిల్ రాజు ఇటీవల కాలంలో చాలామంది రాజకీయ నాయకులను కలుస్తున్నారు అనే విధంగా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆయనకు తెలంగాణలో కూడా చాలామంది రాజకీయ మిత్రులతో కూడా పరిచయాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తున్నారు అని కూడా చాలా రకాల కామెంట్స్ వినిపించగా ఆ విషయంలో కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు.

కాలమే నిర్ణయిస్తుంది
కేటీఆర్ మాట్లాడుతూ బలగం సినిమాను ఇప్పటికే కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూశారు. ఇక మరికొందరు రాజకీయ నాయకులు కూడా చూస్తామని అంటున్నారు. రాజకీయాల్లో మాకు తెలిసిన బంధువులు కూడా చాలామంది ఉన్నారు. అయితే నేను రాజకీయాల్లోకి వస్తానా లేదా అనే విషయం ఇప్పట్లో తెలియదు అని కాలమే నిర్ణయిస్తుంది అని దిల్ రాజు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











