twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె లేకపోవడం షాక్.. నన్ను అలా సాగనంపింది.. ఏదో చెడు జరుగబోతున్నదని.. దిల్ రాజు

    టాలీవుడ్‌లో దిల్ రాజుది నిర్మాతగా ప్రత్యేక స్థానం. ఇటీవల ఆయన చాలా విభిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో దిల్ రాజుది నిర్మాతగా ప్రత్యేక స్థానం. ప్రతీ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడదగ్గిన సినిమాలు తీస్తారు. ఇటీవల ఆయన చాలా విభిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రాణం కంటే ఎక్కువ చూసుకొన్న భార్యను కోల్పోవడం ఓ విషాదం కాగా, ఆయన తీసిన శతమానం భవతి చిత్రం జాతీయ అవార్డును గెలుచుకోవడం ఓ సంతోషకరమైన విషయం. ఇలాంటి రెండు రకాల పరిస్థితిని ఎదుర్కొంటున్న దిల్ రాజు ఇటీవల ప్రముఖ పత్రికతో మనోభావాలను పంచుకొన్నారు.

    ఒత్తిడి దూరమయ్యేది..

    ఒత్తిడి దూరమయ్యేది..

    నా భార్య నా నుంచి దూరంగా వెళ్లిపోవడం జీవితంలో చాలా పెద్ద వెలితి. సినీ నిర్మాణ విషయాల కారణంగా ఒత్తిడితో ఇంటికి చేరితే ఆ దానిని మరిచిపోయేలా చేసేలా ప్రశాంతతను కలిగించేంది. గత కొద్ది రోజులుగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నది. వేరే హెల్త్ ఇష్యూస్ లేవు. బరువు తగ్గాలని ఎప్పుడూ చెప్తుండే వాడిని. మా అమ్మాయికి మాటలు వచ్చి నన్ను డాడీ అని పిలవడం మొదలు పెట్టినప్పటి నుంచీ అనిత నన్ను డాడీ అనడం మొదలుపెట్టింది. మనవడితో కూడా అలానే అపిలిపిస్తాననేది. 27 ఏళ్ల దాంపత్య జీవితంలో పేరు పెట్టి పిలిచిన దాఖలాలు లేవు.

    ఆమె లేకపోవడం వెలితిగా ఉంది..

    ఆమె లేకపోవడం వెలితిగా ఉంది..

    ప్రస్తుతం నా జీవితంలో ఆమె లేకపోవడం నిజంగా పెద్ద షాక్‌. అనిత చనిపోయినాక డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటే ఏదో వెలితిగా ఉంటున్నది. అనిత కూర్చునే కుర్చీ ఖాళీగా కనిపిస్తుంటే చెప్పలేనంత బాధ. వద్దంటున్నా కొసరి కొసరి వడ్డించేది. ఆ మధురస్మృతులు ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పట్లో జ్హాపకాల నుంచి ఇప్పట్లో బయటపడటం చాల కష్టం.

    చివరి సినిమా అదే..

    చివరి సినిమా అదే..

    అనితకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా శతమానం భవతి. మేం కలిసి చూసిన చివరి సినిమా అదే. ఆమెతో చివరిసారిగా కలిసి ‘శతమానం భవతి' సినిమా ఆడియో ఫంక్షన్‌కు ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా హాజరయ్యాం. ఆ రోజు నాన్నగారి పుట్టినరోజుని ఆ స్టేజిపైనే సెలబ్రేట్‌ చేశాం. ఆ తర్వాత ‘శతమానం భవతి' సక్సెస్‌మీట్‌కు అందరం కలసి వెళ్లాం. అదే లాస్ట్‌.

    అలా సాగనంపింది..

    అలా సాగనంపింది..

    గత నెల 6వ తేదీన రాత్రి రెండు గంటలకు నేను ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరినప్పుడు తను నిద్రలేచి సాగనంపింది. ఆ రోజు ఉదయం పావ్‌ బాజీ చేసి, తినేవరకూ ఊరుకోలేదు. ఆమె చేతుల మీదగా తిన్న చివరి ఫుడ్‌ అదే. అంతకు ముందు రోజు మనవడు బోర్లా పడుతున్నాడని వాళ్ల అమ్మానాన్నలను ఇంటికి పిలిపించింది. నేనిక్కడ లేనప్పుడు జరగరానిది జరుగుతుంది కాబట్టి, మా పాపకు తోడుగా ఉండటం కోసం అనిత తన అమ్మానాన్నలను మా ఇంటికి పిలిపించుకొన్నది. చివరి క్షణాల్లో నేను తప్ప.. అందరూ దగ్గర ఉండేలా దేవుడు జాగ్రత్తలు తీసుకొన్నాడనిపిస్తున్నది.

    ఏదో చెడు జరుగబోతున్నదని..

    ఏదో చెడు జరుగబోతున్నదని..

    వాస్తవానికి మా ఇంట్లో చెడు జరగబోతోందని అనిపిస్తుండేది. ఏదో కలవరం ఉండేది. నేను ఒకటి ప్లాన్‌ చేస్తే మరోకటి జరుగుతున్నది. దువ్వాడ జగన్నాధం షూటింగ్‌ కోసం నేను కర్ణాటకలోని బేలూరు వెళ్లాలి. యూనిట్‌ మొత్తం వెళ్లారు. నాకు జ్వరం రావడంతో ఆగిపోయాను. తర్వాత రోజు ఉదయం విమానంలో బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి బేలూరు వెళ్లా. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. ఆలయంలో షూటింగ్ ప్లాన్‌ చేశాం. కానీ అనుమతి దొరకలేదు. మార్చి 19న బ్రహ్మోత్సవాలకి వెళ్లాలనుకున్నాం. 11న ఊహించని సంఘటన జరిగింది.

    ఆ 27 గంటలూ ఏవో ఆలోచనలు

    ఆ 27 గంటలూ ఏవో ఆలోచనలు

    అనిత చనిపోయిందనే కబురు వచ్చాక అమెరికా నుంచి నాకు ఇక్కడికి రావడానికి 27 గంటలు పట్టింది. అన్ని గంటల్లో నాకు కంటి మీద కునుకు రాలేదు. ఏవో జ్ఞాపకాలు కళ్లు మూత పడనివ్వలేదు. అంతా భగవంతుడు ఎప్పుడు, ఏమి చేయాలనుకుంటాడో ఆయనకే తెలుసు

    English summary
    Producer Dil Raju's wife Anitha died with cardic arrest while he was in US. Without his wife now Dil Raju feeling some kind of shock. He shares his feelings, memories with wife Anitha with media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X