నిర్మాత దిల్ రాజ్ ప్లాన్ బీ.. సంక్రాంతి అల్లుడిగా పవన్ కల్యాణ్
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడానికి నిర్ణయం తీసుకొన్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అదే కాకుండా హిందీలో పింక్ లాంటి సినిమా రీమేక్‌లో ఓ ఉదాత్తమైన పాత్ర ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనే విషయం ఫ్యాన్స్‌లో ఉత్తేజాన్ని రెండింతలు చేసింది. అయితే సినిమా పరిశ్రమపై కరోనా దెబ్బ పడటంతో అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే వకీల్ సాబ్ సినిమాపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకొన్నారనే వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే..

రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ
దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ పింక్ రీమేక్‌లో నటించనున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోష్ నింపింది. అప్పటికే పవన్ కల్యాణ్‌తో సినిమాలు తీయాలని ఎదురుచూస్తున్న వారంతా అలర్ట్ అయ్యారు. వెంటనే తమకు తోచిన కథలు వినిపించి ఆయనను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. ఆ క్రమంలో చాలానే కథలు విన్నట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే అగ్రిమెంట్స్
అయితే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగిన సినిమాలను పూర్తి చేయడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపడంతో సదరు నిర్మాతలు తమ కథలతో రెడీ అయిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్, అలాగే క్రిష్ జాగర్లమూడి లాంటి ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలను సిద్ధం చేసుకొన్నారు. అయితే పింక్ మొదలుగా షూటింగ్ ప్రారంభం కావడంతో ఈ ఏడాది మొదటి భాగంలో పవన్ కల్యాణ్‌ను చూద్దామని అభిమానులు రెడీ అయ్యారు.

పింక్ రీమేక్‌తో పవర్ స్టార్
అభిమానులు జోష్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పవన్ కల్యాణ్ చకచకా షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు. అదే జోష్‌తో సినిమాను పూర్తి చేసే క్రమంలో వారి ప్రయత్నాలకు కరోనావైరస్ బ్రేక్ వేసింది. అయితే 90 శాతం షూటింగ్ పూర్తయిందనే యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా మిగిలి ఉన్న 10 శాతం షూటింగ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే లాక్‌డౌన్ సడలింపు తర్వాత కరోనా ప్రభావం భారీగా ఉండటంతో షూటింగ్ చేయడానికి ఇబ్బందిగా మారింది.

వచ్చే ఏడాదిలోనే వకీల్ సాబ్
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పట్లో షూటింగులు మొదలవుతాయనే నమ్మకం సన్నగిల్లుతున్నది. కనీసం ఆగస్టు, సెప్టెంబర్‌లో షూటింగులకు వెసలుబాటు కలుగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దిల్ రాజు తన వకీల్ సాబ్ రిలీజ్‌పై కీలక నిర్ణయం తీసుకొన్నారని తెలిసింది. షూటింగులు మొదలైనప్పటికీ వకీల్ సాబ్‌ను ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Recommended Video

సంక్రాంతి బరిలో పవన్ కల్యాణ్
కరోనా కారణంగా టాలీవుడ్‌లో అగ్ర హీరోల భారీ ప్రాజెక్టుల సెట్స్‌పైకి వెళ్లడం, లేదా సెట్స్‌పైకి వెళ్లిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. పరిస్థితులన్నీ అదుపులోకి వస్తే సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలు లేకపోవడంతో వకీల్ సాబ్‌ను సంక్రాంతి అల్లుడిగా మార్చాలనే ప్లాన్ బీని దిల్ రాజు తెరపైకి తెచ్చినట్టు తెలుస్తున్నది. అయితే యూనిట్ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇస్తే రిలీజ్ డేట్‌పై అనుమానాలు తొలిగిపోతాయి.


Click it and Unblock the Notifications











