twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అత్తారింటికి దారేది కూడా.. ఇండస్ట్రీని వదిలేయాలని ఉందన్న అల్లు అరవింద్, దిల్ రాజు ఎమోషనల్‌గా!

    |

    గీత గోవిందం చిత్రం విడుదలకు ముందే పైరసీ కావడం టాలీవుడ్ లో సంచలనం కలిగించిన విషయం. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందింది. చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు మిగిలిన చిత్ర యూనిట్ షాక్ లో ఉన్నారు. పైరసీ నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి గీత గోవిధం చిత్రానికి మద్దత్తు లభిస్తోంది. తాజగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర పైరసీ వ్యవహారం గురించి మాట్లాడారు. అల్లు అరవింద్, బన్నీ వాసుతో పాటు దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

    సినిమా రెడీ కావాలంటే

    సినిమా రెడీ కావాలంటే

    ఒక దర్శకుడు కథ సిద్ధం చేసుకుని, నిర్మాతని పట్టుకుని నటీనటుల్ని ఎంపిక సినిమా రెడీ అవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందమైన సినిమా రూపొందాలంటే ఇంత కష్టం ఉంటుందని దిల్ రాజు అన్నారు.

    Recommended Video

    Vijay Deverakonda Speech @Geetha Govindam Pre Release Event
    ఆలోచించారా

    ఆలోచించారా

    అంత కష్టం దాగివున్న సినిమాని ఇలా నడి రోడ్డు మీదకు తీసుకునివస్తే ఎంతమంది భాదపడతారో ఆలోచించారా. ఎంతమంది కష్టం దాగివుందో అని ఆలోచించారా అంటూ దిల్ రాజు ఎమోషనల్ అయ్యారు.

     ఇండస్ట్రీని వదిలేయాలని

    ఇండస్ట్రీని వదిలేయాలని


    గీత గోవిదం చిత్రం పైరసీ జరిగిందని తెలిసి అల్లు అరవింద్ కు ఫోన్ చేశా. ఇండస్ట్రీని వదిలేయాలని ఉందని ఎమోషనల్ అయ్యారు. ఆయన ఇండస్ట్రీలో 40 ఏళ్ల నుంచి ఉంటున్నారు. అరవింద్, చిరంజీవి గారు ఇండస్ట్రీ ఫ్యామిలీ. అలాంటి వ్యక్తి భాదపడుతూ ఆ మాట అనడం నాకు బాధకలిగించిందని దిల్ రాజు తెలిపారు.

    అత్తారింటికి దారేది కూడా

    అత్తారింటికి దారేది కూడా

    సినిమా రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు పైరసీ చేయాలని చూశారు. అత్తారింటికి దారేదికి కూడా ఇలాగె జరిగింది. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేసింది. అరవింద్ గారికి కూడా అదే చెప్పా. మేమంతా ఉన్నాం ఎమోషనల్ కావద్దని కోరా. పోలీసులు కూడా వేగంగా స్పందిస్తున్నారని దిల్ రాజు తెలిపారు.

    తట్టుకోలేం

    తట్టుకోలేం

    పైరసీ చేసేవాళ్ళు ఒక్క సారి ఆలోచించాలి. సినిమా రిలీజ్ అయ్యే వరకు తీవ్రమైన టెన్షన్ తో బతుకుతాం. దానికి తోడు ఇలాంటివి జరిగితే తట్టుకోలేం అని దిల్ రాజు అన్నారు.

    టెక్నాలజీ

    టెక్నాలజీ

    టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు పైరసీ చేసినా పోలీసు వారికి నిమిషాల్లో తెలిసిపోతుంది. రిక్వస్ట్ అనుకోండి హెచ్చరిక అనుకోండి. కేసులు నమోదైతే మీ జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి అని దిల్ రాజు అన్నారు.

    English summary
    Producer Dil Raju Shares An Unknown Emotional Incident With Allu Aravind. Dil Raju about Geetha Govindam piracy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X