India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dil Raju: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దిల్ రాజు భార్య.. 51 ఏళ్ల వయసులో తండ్రైన నిర్మాత

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆయన... నితిన్ నటించిన 'దిల్' అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుని స్టార్ ప్రొడ్యూసర్‌ అయిపోయారు. అప్పటి నుంచి మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ, మధ్య మధ్యలో కొన్ని చిత్రాలను పంపిణీ సైతం చేస్తున్నారు. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న దిల్ రాజు.. 2017లో తన భార్యను కోల్పోయారు. ఆ తర్వాత అంటే రెండేళ్ల క్రితమే తేజస్విని అనే మహిళను పెళ్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా దిల్ రాజు ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మొత్తం చదవండి!

   లాక్‌డౌన్ పెళ్లాడిన దిల్ రాజు

  లాక్‌డౌన్ పెళ్లాడిన దిల్ రాజు

  దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె పోయిన తర్వాత చాలా కాలం పాటు ఒంటరిగానే ఉన్న ఆయన.. 2020 మార్చిలో హైదరాబాద్‌కు చెందిన తేజస్వినీని వివాహం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా నిరాడంభరంగా జరిగిన ఈ వేడుకను నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపారు.

  రష్మిక మందన్నా అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడనంత హాట్‌గా!

  ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ

  ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ


  వివాహం తర్వాత కొద్ది రోజులకు ప్రొడ్యూసర్ దిల్ రాజు తన భార్య తేజస్మినిని ఇండస్ట్రీ పెద్దలకు పరిచయం చేశారు. ఇందుకోసం ఆయన గ్రాండ్ పార్టీని నిర్వహించారు. దీనికి టాలీవుడ్‌లోని బడా హీరోలు అందరూ హాజరయ్యారు. అలాగే, పలు ఇండస్ట్రీలకు చెందిన డైరెక్టర్లు, హీరోలు కూడా వచ్చారు. అలాగే, చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు.

  తండ్రి కాబోతున్నాడని టాక్

  తండ్రి కాబోతున్నాడని టాక్

  తేజస్వినిని వివాహం చేసుకున్న కొద్ది రోజలు తర్వాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపై ఎన్నో రకాల ప్రచారాలు కూడా జరిగాయి. కానీ, దిల్ రాజు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ దీనిపై స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంతా అనుకున్నారు. ఫలితంగా కొన్ని రోజులకు ఇవి పుకార్లే అని అనుకున్నారంతా.

  బాత్‌టబ్‌లో నగ్నంగా అషు రెడ్డి: స్నానం చేస్తున్న పిక్‌లతో రచ్చ.. ఇలా తెగించిందేంటి!

  పండంటి బిడ్డకు జన్మనిచ్చి

  పండంటి బిడ్డకు జన్మనిచ్చి

  బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భార్య తేజస్విని తాజాగా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సాధారణ ప్రసవం ద్వారా తల్లి అయ్యారని తెలిసింది. ఇక, దిల్ రాజు ఇంట్లోకి వారసుడు వచ్చిన విషయాన్ని ఆయన పీఆర్ టీమ్ సభ్యులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. దీంతో ఈ ప్రొడ్యూసర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  హైదరాబాద్ చేరిన దిల్ రాజు

  హైదరాబాద్ చేరిన దిల్ రాజు

  వాస్తవానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవలే దుబాయ్ వెళ్లారు. అక్కడ తన కార్యకలాపాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే తేజస్వినికి డెలివరీ అయిన విషయం తెలిసింది. దీంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయమే దిల్ రాజు నగరానికి చేరుకున్నారు. ఆ వెంటనే ఆస్పత్రికి వెళ్లి తన వారసుడిని, భార్యను చూశారని టాక్.

  Ram Marriage: ప్రియురాలితో హీరో రామ్ పెళ్లి.. నిశ్చితార్థం, వివాహం అప్పుడే.. అమ్మాయి ఎవరంటే!

  కూతురికి కీలక బాధ్యతలు

  కూతురికి కీలక బాధ్యతలు

  దిల్ రాజు - అనిత దంపతులకు హన్షిత అనే అమ్మాయి ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. కొన్ని సినిమాలకు దిల్ రాజు లేకున్నా ఆమె స్వయంగా పర్యవేక్షిస్తుంటుంది. అంతేకాదు, ఆమె తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్షితకు సోదరుడు వచ్చాడు.

  భారీ ప్రాజెక్టులతో దిల్ రాజు

  భారీ ప్రాజెక్టులతో దిల్ రాజు

  దిల్ రాజు ప్రస్తుతం భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో శంకర్ - రామ్ చరణ్ కలయికలో వచ్చే సినిమా ఒకటి కాగా.. విజయ్ - వంశీ పైడిపల్లి కాంబోలో వస్తున్న చిత్రం మరొకటి. వీటితో పాటు నాగ చైతన్య 'థ్యాంక్యూ' మూవీని కూడా ఆయనే నిర్మించారు. ఇది త్వరలోనే విడుదల కాబోతుంది. వీటితో పాటు ఎన్నో చిత్రాలను ఆయన డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు.

  English summary
  Tollywood Star Producer Dil Raju Married Tejaswini 2 Years back. Now She Gave Birth to Baby Boy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X