Shah Rukh Khan Jawan: కళ్లు చెదిరే ధరకు 'జవాన్' రైట్స్... దిల్ రాజు భారీ రిస్క్

'పఠాన్' ఇచ్చిన బ్లాక్ బాస్టర్ సక్సెస్ తో మళ్లీ సక్కెస్ ట్రాక్ ఎక్కిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. ఈ జోరును అలానే కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. త్వరలోనే 'జవాన్' సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం అందింది. అది కూడా ట్రైలర్ రిలీజ్ కాకుముందే. మరో విషయమేమిటంటే.. ఈ చిత్ర తెలుగు రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ రిస్క్ చేశారని తెలిసింది. వివరాళ్లోకి వెళితే..

సౌత్ మార్కెట్ పై ఫోకస్... :సాధారణంగానే హిందీ హీరోలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి మార్కెట్ వ్యాల్యూ కూడా ఎక్కువే. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ను వాళ్లే ఏలుతున్నారు. అలానే అప్పట్లో తమకున్న బ్రాండ్ వ్యాల్యూకి అక్కడి స్టార్ హీరోలు.. సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ ను అంతగా లెక్కచేసేవారు కాదు. కానీ ఇప్పుడలా కాదుగా. ఇండియన్ సినిమా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ హీరోలు, సినిమాల క్రేజ్ పెరిగిపోయింది. అదే సమయంలో హిందీ సినిమాలు సరైన కథల లేక డీలా పడిపోయాయి. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా వరుసగా ఫ్లాప్ అయిపోతున్నారు. దీంతో ఇప్పుడు వారంతా సరైన కథలతో సౌత్ మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో తమ సత్తా నిరూపించాల్సిన పరిస్థితి మరింత ఏర్పడింది.

Producer dilraju doing rescue on sharukh khan jawaan rights for big price

స్ట్రైట్ సినిమాలు.. :హిందీ కథలతో సినిమాలు చేసి ఎటువంటి ఉపయోగం లేదు.. సౌత్ ఇండస్ట్రీలోని రీజనల్ లాంగ్వేజ్ లో నేరుగా సినిమాలు చేస్తేనే .. పాన్ ఇండియా స్థాయిలో గట్టి హిట్ కొట్టచ్చు! అని భావిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ కూడా తెలుగు నేటివిటీని టచ్ చేస్తూ.. 'కిసీ కీ భాయ్.. కిసీ కీ జాన్' చేశాడు. రామ్ చరణ్, వెంకటేశ్ ను కూడా రంగంలోకి దించాడు. కానీ ఆ చిత్రం స్టోరీ పరంగా వర్కౌట్ అవ్వలేకపోయింది. మరోవైపు షారుక్ ఖాన్.. డైరెక్ట్ గా తమిళ స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో 'జవాన్ ' టైటిల్ తో రూపొందుతోంది. త్వరలోనే ఇది విడుదల కానుంది.

Producer dilraju doing rescue on sharukh khan jawaan rights for big price

భారీ బిజినెస్.. :ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఇప్పుడీ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలిసింది. ఏకంగా రూ. 250కోట్లకు ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసిందని తెలిసింది. అలాగే ఈ సినిమా థియేట్రిికల్ రైట్స్ కు కూడా గట్టి పోటీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Producer dilraju doing rescue on sharukh khan jawaan rights for big price

దిల్ రాజ్ భారీ రిస్క్... :తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారని సమాచారం అందింది. భారీ దరకు డీల్ కుదుర్చుకున్నారని ఇన్ సైడ్ టాక్. సాధారణంగా దిల్ రాజ్.. చాలా క్యాల్కులేషన్స్ తో ఎన్నో అంచనాలు వేసి ఓ చిత్రాన్ని కొనుగోలు చేస్తారు. అయితే బాద్ షాకు ఇంతవరకు తెలుగులో పెద్దగా విజయాలు ఏమీ రాలేదు.. కేవలం డైరెక్టర్ అట్లీ పై నమ్మకం ఉంచి దిల్ రాజు ఈ భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా 'జవాన్' చిత్రం పై దిల్ రాజు భారీ రిస్కే చేయబోతున్నారని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X