నిర్మాత అదృశ్యం: మహేష్ వేధింపుల వల్లే అంటూ ప్రచారం!

డైరెక్టర్ మహేష్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి నిర్మాత పూర్ణ రాజు కనిపించకుండా పోయారనే ప్రచారం సాగుతోంది. దీంతో బంజారాహిల్స్ పీఎస్ ఎదుట పూర్ణరాజు బంధువులు ఆందోళనకు దిగారు. పూర్ణ రాజు బంధువులతో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు రాజీకి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ద్వారా ఈ వార్త వ్యాపించడంతో......ఫిల్మ్ నగర్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. ఈ రోజు సాయంత్రం లేదా, రేపటికల్లా అసలు విషయం తేలనుంది.


Click it and Unblock the Notifications