నాని, నితిన్‌ను హీరో చేసి.. విలన్‌గా మారిన టాలీవుడ్ నిర్మాత!
టాలీవుడ్‌లో నిర్మాత డీఎస్ రావు విలన్‌గా మారారు. హీరో నితిన్‌తో ద్రోణ, నానితో పిల్ల జమీందార్, నిఖిల్‌తో కళావర్ కింగ్, మంచు మనోజ్‌తో మిస్టర్ నూకయ్య లాంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు నటుడిగానూ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం "రంగు, నయనం, విశ్వామిత్ర, ప్రేమకథాచిత్రం-2, కల్కి, యుద్ధం చెయ్" లాంటిటి చిత్రాలో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. నటుడిగా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారు. ఈ సందర్భంగా నటుడిగా బిజీగా మారడంపై డీఎస్ రావు స్పందించారు.
నవంబర్ 10, తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతగా ఇప్పటికి 20 సినిమాలు తీశాను. ప్రముఖ దర్శకుడు తేజ ప్రోత్సాహంతో నటుడిగా మారాను. ప్రముఖ దర్శకుడు తేజ తొలిసారి డి.ఎస్.రావులోని నటుడిని గుర్తించి, 'హోరాహోరీ'లో విలన్ గా అవకాశమిచ్చారు అని తెలిపారు.

తదుపరి నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన "కళ్యాణవైభోగం"లోనూ ముఖ్య పాత్ర పోషించాను. ఇప్పటికి 15 సినిమాలు చేశాను. తెలుగుతోపాటు కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాను. నటుడిగా రాణిస్తూనే.. మంచి ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు ప్రొడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా విలన్ గా మంచి గుర్తింపు సాధించాలని కోరుకుంటున్నాను అని డీఎస్ రావు అన్నారు.


Click it and Unblock the Notifications











