RRR పై మెగాస్టార్ పెట్టుబడి.. ఆస్కార్ అవార్డుకు దూరం.. ఈ సందేహాలపై నిర్మాత దానయ్య క్లారిటీ!
నిర్మాత DVV దానయ్య తెలుగులో దాదాపు ప్రముఖ హీరోలందరితో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం లిస్టులో మరికొందరు అగ్ర హీరోలు కూడా ఉన్నారు. అయితే దానయ్య ప్రొడక్షన్ లో వచ్చిన RRR సినిమా ఇటీవల నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకోవడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా యూనిట్ ఆస్కార్ హడావుడిలో ఎక్కడ దానయ్య కనిపించకుండా ఉండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే RRR బడ్జెట్ లో చిరంజీవి కూడా ఇన్వెస్ట్ చేశారని టాక్ వచ్చింది. ఇక ఆ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అంధించడమే కాకుండా ఆస్కార్ వరకు తీసుకు వెళ్లింది. సినిమా లోని నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ లకు ఆస్కార్ అవార్డులు దక్కాయి. ఇక ఆ సంతోషంలో RRR టీమ్ మునిగి తెలుతోంది.

చాలా రకాల అనుమానాలు
అయితే RRR ఆస్కార్ వేడుకల కోసం హీరోలు అలాగే దర్శకుడు మిగతా కొంతమంది యూనిట్ సభ్యులు కూడా వెళ్ళారు. కానీ నిర్మాత దానయ్య ఎందుకు వెళ్ళలేదు అనే విషయంలో చాలా రకాల అనుమానాలు వచ్చాయి. కావాలని దానయ్యను దూరం పెట్టారు అని ఆయన కూడా ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యారు అని కూడా అనేక రకాల రూమర్స్ వినిపించాయి.

నన్ను దూరం పెట్టలేదు
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న కథనాలపై నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక విధంగా RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. అందుకోసం రాజమౌళి ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఆస్కార్ కు సంబంధించిన విషయాలు మొత్తం వారే చేసుకున్నారు. అంతే కాకుండా నన్ను ఎవరు దూరం పెట్టలేదు. నేను అలాంటి హడావిడి కి దూరంగానే ఉంటాను. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని కూడా దానయ్య వివరణ ఇచ్చారు.

ఇంకా పెద్ద సినిమా చేయాలని
దర్శకుడు రాజమౌళి ఎంతో మంచివారు. ఆయనకు చాలా ఏళ్ల క్రితం నేను చిన్న అడ్వాన్స్ ఇచ్చే సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నాను. అయితే ఆయన ఇచ్చిన మాట కోసం మిగతా వారి నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా లెక్క చేయలేదు. అసలైతే మర్యాద రామన్న చేయాలని అనుకున్నారు. కానీ నాకు ఇంకా పెద్ద సినిమా చేయాలని ఉంది అని అన్నప్పుడు ఈ తరహాలో మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకు వచ్చారు. అలాంటి సినిమాను నిర్మించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని దానయ్య తెలిపారు.

మెగాస్టార్ పెట్టుబడి
అలాగే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా పెట్టుబడి పెట్టారు అని కథనాలు వెలుపడ్డాయి అయితే అందులో కూడా ఎలాంటి నిజం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు నా సినిమాలోనే కాదు రామ్ చరణ్ కు సంబంధించిన ఈ సినిమాలోను ఆ తరహాలో ప్రవర్తించలేదు.. పూర్తిగా ఈ సినిమాను నేనే నిర్మించాను అని నిర్మాత దానయ్య వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











