హీరోయిన్ పై మీడియా వద్ద నిర్మాత ఫైర్
సినిమా ప్రచారం కోసం హీరోయిన్ రాధికగాంధీ సహకరించలేదని హొస ప్రేమపురాణ సినిమా యూనిట్ సభ్యులు ప్రెస్‌మీట్‌లో నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయారు. సినిమా హీరోయిన్ రాధికగాంధీ, పూజగాంధీ ప్రెస్‌మీట్‌కు రాకుండ తనకు అన్యాయం చేశారని, రూ. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశాను, ఇప్పుడు ప్రచారానికి రాకుండ నష్టం కలిగిస్తున్నారని నిర్మాత ప్రసాద్ అవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో పూజాగాంధీ ఓ కన్నడ టీవీ చానెల్‌లో మాట్లాడుతూ సినిమాను ఏడాది ఆలస్యంగా విడుదల చేశారని, కనీసం చిత్రం ప్రీమియర్ షో చూపించకుండ విడుదల చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి తీసుకురాలేదని అన్నారు. చీప్‌ట్రిక్స్ తో రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తన సోదరి రాధికగాంధీ మీడియా సమావేశానికి ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు.
దర్శకుడు శివకుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం రాధికగాంధీ, పూజాగాంధీకి నిర్మాత ప్రసాద్ ఫోన్ చేసి చెప్పినా వారు రాలేదని ఆరోపించారు. ప్రస్తుతం పంచాయితీ చిత్రసీమ పెద్దల వద్దకు చేరింది ముంబాయి నుంచి శ్రద్దదాస్ వచ్చారు. హీరో నితిన్, దర్శకుడు శివకుమార్, నిర్మాత ప్రసాద్ తదితర యూనిట్ సభ్యులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications












