Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బండ్ల గణేష్ ఇంట్లో ఘనంగా వివాహ వేడుక.. హాజరైన చిరంజీవి.. రాజమౌళి (ఫోటోలు)
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహా వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు.
నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి.. హాజరైన చిరంజీవి, రాజమౌళి తదితరులు (ఫొటోలు)
తన సోదరుడి కుమార్తె అశ్రిత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు సాయి పవన్‌తో అంగరంగ వైభవంగా నిర్మాత బండ్ల గణేష్ జరిపించారు. నూతన వధూవరులను సినీ ప్రముఖులు ఆశీస్సులు దీవెనలు అందించారు.
సినీ పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులు, నిర్మాత సురేష్ బాబు, హస్యనటుడు బ్రహ్మానందం, హీరో శ్రీకాంత్ దంపతులు, హీరో గోపిచంద్, జయసుధ ఫ్యామిలీ సభ్యులు, వినాయక్, తదతరులు హాజరయ్యారు.
తెలంగాణ మంత్రులు డాక్టర్ రెడ్డి, ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్, జేసీ దివాకర్ రెడ్డి, ఎన్టీవీ అధినేత చౌదరీ, ఎంపీ కేశవరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.