హీరోయిన్ హరిప్రియపై ఫిర్యాదు
హైదరాబాద్: పిల్ల జమిందార్, తకిట తికట, అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్ చిత్రాల్లో నటించిన కన్నడ బ్యూటీ హరిప్రియపై కన్నడ నిర్మాతల మండలిలో ఫిర్యాదు నమోదైంది. డబ్బులు తిరిగిచ్చేయమని నిర్మాత అడగ్గా...ఇచ్చే అలవాటు లేదని ఆమె తేల్చి చెప్పింది.
వివరాలు స్లైడ్ షెలో...

‘ఫ్లై' అనే సినిమా కోసం..
'ఫ్లై' అనే కన్నడ చిత్రంలో హరిప్రియను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. రూ. 6 లక్షలకు రెమ్యూనరేషన్ ఓకే అయింది. 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఆమెకు ఇచ్చేసారు.

సుదీప సినిమాలో...
కానీ సుదీప్ కాంబినేషన్లో చేస్తున్న చిత్రంతో బిజీ కావడంతో ‘ఫ్లై' చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయిందట హరిప్రియ.

ఆమె స్థానంలో నిధి సుబ్బయ్య
దాంతో ఆమె స్థానంలో నిధి సుబ్బయ్యను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

డబ్బు ఇవ్వాలంటూ నిర్మాత
దీంతో నిర్మాత తన అడ్వాన్స్ రూ. 2 లక్షల తిరిగి ఇవ్వమని ఆ నిర్మాత కోరడంతో ఇవ్వనని చెప్పేసిందట హరిప్రియ. అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బు తిరిగిచ్చే అలవాటు తనకు లేదని తేల్చి చెప్పిందట.

నిర్మాత ఆగ్రహం
దీంతో చిర్రెత్తిన నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసారు.


Click it and Unblock the Notifications











