సార్ ఒక్క అవకాశం... అవసరమైతే అల్లు అర్జున్ గేటు ముందు నిల్చుంటా!

Recommended Video

Distributors Competing For Lovers Day Movie | Filmibeat Telugu

వింక్ గర్ల్‌ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్ నటించిన 'లవర్స్ డే' ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానున్నది. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో గురురాజ్ మాట్లాడుతూ... ఒక మలయాళం సినిమాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చి ఈ స్థాయిలో డిమాండ్ రావడానికి కారణం అల్లు అర్జున్. ఆయన తమ సినిమాను ప్రమోట్ చేయడం వల్లే ఈ స్థాయి వచ్చిందన్నారు.

ఇక్కడి సినిమాలకే ఎవరూ సాయం చేయని ఈ రోజుల్లో...

ఇక్కడి సినిమాలకే ఎవరూ సాయం చేయని ఈ రోజుల్లో...

స్ట్రైట్ సినిమాను కూడా ఎంకరేజ్ చేయడానికి ముందు రాని ఈ రోజుల్లో ఒక డబ్బింగ్ సినిమా కోసం వచ్చి... వినోద్ రెడ్డిని, నన్ను బ్లెస్ చేయడం మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ సార్ వచ్చి ఉండక పోతే సినిమాపై ఇంత క్రేజ్ వచ్చి ఉండేది కాదని గురురాజ్ అన్నారు.

సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ల పోటాపోటీ

సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్ల పోటాపోటీ

అల్లు అర్జున్ సపోర్టుతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వస్తాయనే నమ్మకం ఏర్పడింది. సినిమా కోసం కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది ఫోన్ చేసి వాడు మనోడు.. అతడికే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వు అని అడుగుతుండటం ఆశ్చర్యం వేస్తోంది.

అల్లు అర్జున్ ఇంటి గడప ముందు నిల్చుంటా

అల్లు అర్జున్ ఇంటి గడప ముందు నిల్చుంటా

మాకు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్‌ సర్‌కు థాంక్స్. ఈ చిత్రం హిట్టైన తర్వాత, మాకు మేము ఇండస్ట్రీలో రుజువు చేసుకున్న తర్వాత అవకాశం ఉంటే అల్లు అర్జున్ సర్ డేట్స్ కోసం ఆయన ఇంటి గడప ముందు నిలబడతాం. మేము అంత స్థాయికి రావాలని ఆయన ఆశీర్వదించారు, త్వరలోనే ఇది జరుగుతుందని ఆశిస్తున్నట్లు గురురాజ్ తెలిపారు.

‘లవర్స్ డే'

‘లవర్స్ డే'

ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్.

కెమెరా: శీను సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X