twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సంతోషం' నిర్మాత కె.ఎల్‌.నారాయణపై కిడ్నాప్, కబ్జా కేసులు

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : బలవంతపు వసూళ్శు, భూకబ్జా, అనుమతి లేకుండా ప్రవేశం, కిడ్నాప్‌లో ప్రమేయం వంటి అభియోగాలపై ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. పోలీసులు చెప్పినదాన్నిబట్టి కోర్టు ఆదేశాలకు లోబడి నిర్మాతపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసారని తెలుస్తోంది. త్వరలో కోర్టుకు ఒక నివేదిక సమర్పిస్తారు.

    వివరాల్లోకి వస్తే...ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ, ఆయన స్నేహితులు, రియల్టర్లు చంద్రారెడ్డి, కృష్ణలపై కేసులు నమోదు చేశారు. బలవంతపు వసూలు, భూకబ్జా, అనుమతి లేకుండా ప్రవేశం, కిడ్నాప్‌లో ప్రమేయం ఉన్న అభియోగంపై నిర్మాత నారాయణ, మరో ఇద్దరు చంద్రారెడ్డి, కృష్ణలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్‌ ఎసిపి ఇ.శంకర్‌ రెడ్డి మీడియాతో అన్నారు.

    కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్‌, రోడ్‌ నెంబర్‌ ఐదులో తన భూమిలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన నిర్మాత నారాయణ, బిల్టర్లు కృష్ణ, చంద్రారెడ్డి కాపలాదారుని బెదిరించారని పేర్కొంటూ సయీద్‌ నయీముద్దీన్‌ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. భూమి విక్రయించాలని వారు పట్టుబట్టారని, విలువైన భూమి కబ్జాలో వారి ప్రమేయముందని ఆరోపించారు.

    కేసును బంజారా హిల్స్‌ పోలీసులకు సూచించిన కోర్టు.. నిర్మాత నారాయణ, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. నారాయణ గతంలో 'క్షణక్షణం', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'సంతోషం' తదితర సూపర్‌ హిట్‌ చిత్రాలను నారాయణ నిర్మించారు.

    ఇక జాస్తి దర్శకత్వంలో మహేష్ గతంలోనే (2007 డిసెంబరులో) 'మిర్చి' అనే టైటిల్ తో ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు. మిర్చిని దుర్గా ఆర్ట్స్ బానర్ ‌పై కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించాలని సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్‌ను, ఆర్ట్ డైరెక్టర్‌ గా అశోక్ ‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్‌ను నిర్మించడానికి అశోక్ పనులు కూడా మొదలుపెట్టాడు.అయితే అప్పుడు స్క్రిప్టు సంతృప్తిగా రాకపోవటంతో ఆగిపోయింది.

    English summary
    
 The Banjara Hills police on Wednesday registered criminal cases against Tollywood producer and two others for involvement in extortion, land grabbing, trespass and kidnap. According to the police, as per directions of the court, they registered criminal cases against Tollywood producer K L Narayana and his friends Chandra Reddy and Krishna, realtors. They would submit a report on this to the court. E Shanker Reddy, assistant commissioner of police (ACP), Banjara Hills, told Express that they booked the three for alleged trespass, kidnap and extortion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X