అలనాటి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మృతి!
తెలుగు చిత్ర పరిశ్రమ మరో గొప్ప నిర్మాతని కోల్పోయింది. ప్రముఖ నిర్మాత కె రాఘవ గత రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. 70, 80 దశకాలలో రాఘవ మంచి కుటుంబ కథా చిత్రాలని నిర్మించారు. ఆయన మృతితో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థని స్థాపించిన ఆయన చిత్ర రంగంలో విజయవంతమైన నిర్మాతగా కీర్తిని పొందారు. తాత మనవడు, తూర్పు పడమర, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, తరంగిణి వంటి చిత్రాలని నిర్మించారు.

సుమన్, రావు గోపాల్ రావు, గొల్లపూడి, భానుచందర్ వంటి గొప్ప నటులందరిని టాలీవుడ్ కు పరిచయం చేసింది ఈయనే. తమిళంలో కూడా రాఘవ చిత్రాలు నిర్మించారు. ఎస్ ఫై బాలసుబ్రమణ్యం తొలి పాట పడిన సుఖ దుఃఖాలు చిత్ర నిర్మాణంలో రాఘవ కూడా భాగస్వామి. అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన రాఘవకు నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులు తరలి వెళుతున్నారు.


Click it and Unblock the Notifications











