twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ రేంజ్‌లో బాలయ్య అలా, ఆ సీన్ చూస్తే ప్రతీ బ్రాహ్మణుడూ ఫ్యాన్ అవ్వాల్సిందే: సి.కల్యాణ్

    |

    కేవలం అగ్ర హీరోల వల్ల సినీ ఇండస్ట్రీ ఎక్కువ కాలం నిలబడదు.చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఊపిరి లాంటివి. అవే లేకపోతే పరిశ్రమ ఆరు నెలల్లో మూతపడుతుందంటున్నారు నిర్మాత సి.కల్యాణ్. నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కల్యాణ్ నిర్మించిన జైసింహా చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ పోకడలపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

     నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే:

    నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే:

    బాలకృష్ణతో సినిమా కోసం చాలాకాలం నుంచి ఎదురు చూసున్నాను. కథా రచయిత రత్నం చెప్పిన కథ నచ్చడంతో.. ముందు అనుకున్న కథ పక్కనపెట్టేశాం. రత్నం అందించిన కథతోనే సినిమాను తెరకెక్కించాం.

    సినిమా విషయానికొస్తే.. 'జైసింహా' పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తయింది. సినిమాను ఇప్పటికీ పదిసార్లు చూశాను. నందమూరి అభిమానులకు ఈ సినిమా పండుగ లాంటిదని చెప్పగలను. బడ్జెట్ పరిధి భారీగానే పెరిగినప్పటికీ.. కథా పరంగా ఖర్చు చేయక తప్పలేదు.

    Recommended Video

    'జై సింహా' కథ లీక్ ! రజినీ సినిమా కు కాపీ నా ?
     వాళ్లిద్దరూ చేస్తేనే..:

    వాళ్లిద్దరూ చేస్తేనే..:

    నయనతార, ప్రకాష్‌రాజ్ నటిస్తే ఈ సినిమా చేయాలి లేదంటే చేయకూడదు అనుకున్నాం. ప్రకాష్‌రాజ్ డేట్స్ లేకపోయినా కథ చెప్పగానే సర్దుబాటు చేసుకుని నటించారు.

    హీరోయిన్ పాత్ర కోసం నయనతార, అనుష్కలను సంప్రదించాం. భాగమతి కారణంగా అనుష్క డేట్స్ కుదరలేదు. దాంతో నయనతారతో పాటు హరిప్రియ, నటాషా జోషీలు హీరోయిన్‌లుగా నటించారు.

    ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే..:

    ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే..:

    సెకండాఫ్ మొత్తం భావోద్వేగాలకు పెద్ద పీట వేసి కథను నడిపించాం. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. సెంటిమెంట్ ప్రకారం బాలకృష్ణ సినిమాకు కథా బలమున్న ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ గనుక సెట్ అయితే ఆ సినిమా హిట్టే. ఈ చిత్రానికి కూడా అలాంటి ఫ్లాష్‌బ్యాక్ కుదిరింది. కాబట్టి సినిమా మంచి విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను.

     రాంచరణ్, అల్లు అర్జున్ తరహా స్టెప్పులు:

    రాంచరణ్, అల్లు అర్జున్ తరహా స్టెప్పులు:

    క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలకు ప్రతీ ఒక్కరు లేచి చప్పట్లు కొడతారు. బాలకృష్ణ కెరీర్‌లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల సరసన నిలిచే సినిమా ఇది.

    ఇక సినిమాలో మరో ఎట్రాక్షన్ బాలయ్య డ్యాన్సులు. యువ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్ తరహాలో ఆయన స్టెప్పులు వేశారు. అవి ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

    ప్రతీ బ్రాహ్మణుడూ..:

    ప్రతీ బ్రాహ్మణుడూ..:

    'జైసింహా' కథలో భాగంగా కుంభకోణంలో 2000మంది పురోహితులపై ఒక సీన్ చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సన్నివేశంలో బ్రాహ్మణుల వైశిష్ట్యం గురించి చెప్పే సన్నివేశం తప్పకుండా నచ్చుతుంది.

    ఈ సినిమా తర్వాత ప్రతీ బ్రాహ్మణుడూ బాలయ్యకు అభిమానిగా మారిపోతాడని చెప్పగలను. అలాగే ధర్నాలు ఎందుకు చేయాలి?.. వాటి అవసరమేంటి? అని చెప్పే సన్నివేశం ఒకటుంది. దానికి చప్పట్లు ఖాయం.

     మాలోనే దొంగలున్నారు..:

    మాలోనే దొంగలున్నారు..:

    చిత్ర పరిశ్రమలో క్యూబ్, యుఎఫ్‌ఓ విధానంతో కొంత మంది చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్యాయంగా అధిక రేట్లు వసూలు చేసి వాళ్లను దోచుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణమైన దొంగలు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు.

    క్యూబ్, యుఎఫ్‌ఓల వల్ల చిత్రపరిశ్రమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతోనే మార్చి 1న దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్ సమయంలో ఎలాంటి షూటింగ్‌లు జరగవు.

     పైరసీపై..:

    పైరసీపై..:

    పైరసీ సమస్య కూడా ఎక్కువవుతుంది. సెల్‌ఫోన్ల వల్లే 70 శాతం పైరసీ జరుగుతోంది. థియేటర్లోకి సెల్‌ఫోన్లు అనుమతించకూడదు. ముందు కష్టం అనిపించినా మెల్లమెల్లగా అలవాటు చేయాలి.

    ప్రస్తుతం చేస్తున్నవి:

    ప్రస్తుతం చేస్తున్నవి:

    వినాయక్-సాయిధరమ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న 'ఇంటలిజెంట్' సినిమా త్వరలోనే పూర్తవుతుంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. చిరంజీవి కెరీర్ లో 'ఖైదీ' సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్ లో 'ఇంటలిజెంట్' అలా నిలిచిపోతుంది.

     రానాతో..:

    రానాతో..:

    దగ్గుబాటి రానాతో '1945' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీస్తున్నాం. వేసవిలో విడుదల చేస్తాం. ఇందులో రెజీనా హీరోయిన్. దీని హిందీ వెర్షన్‌కు రానా నిర్మాత. ఇక సుందర్.సి రూపొందించనున్న సంఘమిత్ర తెలుగు వెర్షన్‌కు నిర్మాతను నేనే. అయితే ఇంకా పనులు మొదలుకాలేదు. ఇందులో హీరోయిన్‌గా లోఫర్ ఫేమ్ దిషా పటానీని అనుకుంటున్నాం.

    English summary
    Producer C Kalyan compared Balayya’s dance moves to that of Ram Charan and Allu Arjun's. An episode shot in Kumbakonam amidst 2000 purohits is a major highlight
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X