మొక్కజొన్న వ్యాపారంలాగానే 'రోబో' ను కూడా
ప్రస్తుతం నేను చేస్తున్న మొక్కజొన్న వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. ఇప్పుడు అదే పాలసీతో సినిమా పరిశ్రమలోనూ అడుగుపెట్టాం. 'రోబో' లాంటి మంచి ప్రాజెక్ట్‌నిచ్చి బయ్యర్లలోనూ నమ్మకాన్ని నింపడానికి కృషి చేస్తున్నాం అంటున్నారు రోబో చిత్రం తెలుగు రైట్స్ తీసుకున్న కన్నారావు. ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం నుంచి మా వ్యాపారం సాగుతోంది. మా శ్రీ కృష్ణ ట్రేడర్స్ కు ఈ మొక్కజొన్న వ్యాపారంలో పలు అవార్డులు కూడా దక్కాయి. ఆది నుంచి ఆ వ్యాపారంలో క్యాష్ అండ్ క్యారీ నినాదంతో ముందుకెళ్తున్నాం. అలాగే రైతుల్లోనూ నమ్మకం పెంచాం. సినిమాను అదే రేంజిలో మార్కెట్ చేస్తాం.
రోబో సినిమాకు సంబంధించి ముందుగానే మార్కెట్ ను కూడా అంచనా వేసే సినిమాను తీసుకున్నాం. అందువల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా, తెలుగు వారికి మంచి సినిమాను అందించే ఘనత దక్కిందన్న సంతృప్తితో ఉన్నాం. "భారీ విడుదల" ఆద్యంతం భారీతనంతో రూపొందిన ఈ చిత్రాన్ని విడుదల చేయడంలోనూ అంతే భారీతనాన్ని చూపిస్తాం. ఈ నెలాఖరులోపు విడుదలయ్యే ఈ సినిమాకు దాదాపు 400-500 ప్రింట్లు తెలుగులో ఉంటాయి. సినిమా హక్కులను తీసుకోవడానికి ముందు కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను, ట్రైలర్స్ ను చూశాం. ఏ ఫ్రేము చూసినా రిచ్ గా, మునుపెన్నడూ చూడని విధంగా అనిపించింది. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు మిత్రులు అశ్వనీదత్, బెల్లంకొండ సురేష్, నల్లమలుపు బుజ్జి తదితరుల సూచనలు, సలహాలు తీసుకుంటూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











