సంస్కార హీనుడు: రాఘవేంద్రరావుపై నిర్మాత సంచలన వ్యాఖ్య
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రాఘవేంద్రరావుకు ఎంత గొప్ప పేరు ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి దర్శకేంద్రుడిపై ఓ ప్రముఖ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన్ను సంస్కార హీనుడిగా అభివర్ణించారు. ఆ నిర్మాత మరెవరో కాదు...గతంలో ఆయనతో త్రిశూలం, జానకి రాముడు చిత్రాలు నిర్మించిన కాట్రగడ్డ మురారి.

రచయిత, నిర్మాత కాట్రగడ్డ మురారి రాఘవేంద్రరావుపై తీవ్రమైన విమర్శలు చేశారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ డాక్టరేట్ ఎలా ఇచ్చిందంటూ ప్రశ్నించారు?. చెన్నైలో శుక్రవారం మురారి రాసిన ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు సంస్కారం, గౌరవం లేవని అలాంటి వ్యక్తికి గీతం యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. గతంలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాఘవేంద్రరావు ఎగ్గొట్టారని తెలిపారు.
సినీ పరిశ్రమలో రాఘవేంద్రరావు కంటే మంచి వ్యక్తులు చాలా ఉన్నారని, అందరినీ విడిచి రాఘవేంద్రరావు లాంటి వ్యక్తులకు డాక్టరేట్ ఇవ్వడం ఏమిటని ఆయన కాట్రగడ్డ మురారి ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











