గ్యాప్ వచ్చింది.. ఎఫెక్ట్ పడదు.. నాలుగు సినిమాలు వరుసగా.. దామోదర్ ప్రసాద్
'అంతకుముందు...ఆ తరువాత', 'కళ్యాణ వైభోగమే' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను రూపొందించిన నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ప్రసాద్ కొత్త తరం, ప్రముఖ నటీ నటుల కలయికతో శ్రీ రంజిత్ మూవీస్ నూతన చిత్రం త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేతగా కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ...'నాని కథానాయుడిగా నందినిరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ 'అలా మొదలైంది నిర్మించాను. సుమంత్ అశ్విన్ కథానాయకునిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకునిగా 'అంతకు ముందు...ఆ తరువాత' నిర్మించాను. మరోసారి నందిని రెడ్డి దర్శకురాలిగా నాగశౌర్య హీరోగా నాయకునిగా 'కళ్యాణ వైభోగమే' చిత్రాలను రూపొందించాను. నేను తీసిన చిత్రాల విజయాల వెనుక వాటి వైవిధ్యమైన కథా బలం తో పాటు చిత్ర తారాగణం, సాకేంతిక నిపుణుల ప్రతిభ ఎంతో ఉంది అని అన్నారు.
నా కెరీర్‌లో పబ్లిసిటీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ సందర్భంగా వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలుపుకొంటున్నాను. దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ వరుసగా చిత్రాలను నిర్మించబోతున్నాను. ఇప్పటికే నాలుగు కథలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయటం జరిగింది అని తెలిపారు.

నాలుగు సినిమాల నిర్మాణం సమాంతరంగా జరుగుతుంది.వీటిలో ఒక చిత్రాన్ని జనవరి నెలలో పూజా కార్యక్రమాలలతో ప్రారంభిస్తున్నాం. నూతన దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీ,నటులతో పాటు, నూతన తారాగణం కూడా ఉంటారు. నటీనటుల వివరాలను కొద్దిరోజులలో ప్రకటిస్తాము.
అలాగే తదుపరి చిత్రాల దర్శకులు, వాటికి సంబంధించిన తారాగణం వివరాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి తెలియ జేయటం జరుగుతుందని తెలిపారు గత చిత్రాల కోవలోనే తమ తదుపరి చిత్రాల కధలు వైవిధ్యంగానే ఉంటాయన్న నమ్మకాన్ని శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











