twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత రక్తం పీలుస్తూ వేల కోట్లు దండుకుంటున్నారు... చిరు, బాలయ్య, పవన్ ఏమైనట్లు?

    By Bojja Kumar
    |

    గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్నాటకలో థియేటర్ల బంద్ నడుస్తున్న సంగతి తెలిసిందే. క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ ప్రొవైడర్స్‌ సినిమా విడుదలకు నిర్మాతల నుండి అత్యధిక డబ్బు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.... దక్షిణభారత దేశ నిర్మాతలంతా ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి ఈ బంద్ కొనసాగిస్తున్నారు.

    మంచి అనుకుంటే చెడు జరిగింది

    మంచి అనుకుంటే చెడు జరిగింది

    థియేటర్ల బంద్‌పై నిర్మాత లయన్ సాయి వెంకట్ స్పందిస్తూ... 13 సంవత్సరాల క్రితం డిజిటల్ వ్యవస్థ వచ్చింది. అంతకు ముందు ఫిల్మ్ రీల్స్ మీద సినిమా రన్ అయ్యేది. క్రమక్రమంగా పాతకాలం నాటి ప్రొజెక్టర్స్ పోయి.... డిజిటల్ విధానం రావడంతో మేమంతా ఆనందపడ్డాము. మాకు ప్రింట్ల డబ్బులు మిగులుతాయి అని సంతోష పడ్డాము. ఆ రోజు మేము మంచిజరుగుతుందని అనుకున్నాం. కానీ ఇపుడు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతోంది... అని తెలిపారు.

     వారికి డబ్బుకు ఎందుకు కట్టాలి?

    వారికి డబ్బుకు ఎందుకు కట్టాలి?

    థియేటర్ రెంటు, డిజిటల్ ప్రొవైడ్ ఖర్చు ఇపుడు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలోని పెద్దలు మాఫియాగా ఏర్పడ్డారు. నిర్మాతల దగ్గర మొదట రూ. 6 వేలు, 7 వేలు వసూలు చేసేవారు. నేడు దాదాపు 13 వేలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక సినిమా 100 థియేటర్లలో రిలీజ్ చేయాలంటే వారానికి 13 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు... అని నిర్మాత సాయి వెంకట్ తెలిపారు.

     పవన్ కళ్యాణ్ 100 కోట్ల సినిమా అయినా, కోటితో తీసే చిన్న సినిమాకు ఒకే రేటా?

    పవన్ కళ్యాణ్ 100 కోట్ల సినిమా అయినా, కోటితో తీసే చిన్న సినిమాకు ఒకే రేటా?

    పవన్ కళ్యాణ్ 100 కోట్ల సినిమాకు అయినా, కోటి రెండు కోట్లతో తీసే చిన్న సినిమాకు అయినా ఒకే రేటు వసూలు చేస్తున్నారు. దీని వల్ల చిన్న నిర్మాతలు సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అసలు డిజిటల్ ప్రొవైడర్స్ వారికి మేము డబ్బులు కట్టాల్సిన అవసరం ఏమిటి? డిజిటల్ ప్రొజెక్టర్ ఖర్చు కూడా థియేటర్ రెంటులోనే కలిసి ఉండాలి, దీనికోసమే మేము పోరాటం చేస్తున్నాము అని సాయి వెంకట్ తెలిపారు.

    అందుకే పరిస్థితి ఇక్కడి వరకు

    అందుకే పరిస్థితి ఇక్కడి వరకు

    డిజిటల్ ప్రొవైడర్స్ వ్యవస్థలో అంతా ఒక మాఫియాగా ఏర్పడ్డారు. ఆ రోజు అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి వారు వారితో కుమ్మక్కు అయ్యారు. డిజిటల్ ప్రొవైడర్లలో వారు భాగస్వాములుగా చేరడం వల్ల ఈ రోజు సమస్య ఇక్కడి వరకు వచ్చింది. మేమంతా ఉద్యమాలు, తిరుగుబాటు చేస్తే సురేష్ బాబు బయటకు వచ్చి జేఏసీ ప్రెసిడెంటుగా ఉండి యావత్ సౌతిండియా నిర్మాతలందరినీ ఏకం చేశారు.... అని సాయి వెంకట్ తెలిపారు.

    చిన్న నిర్మాత చచ్చిపోయే పరిస్థితి

    చిన్న నిర్మాత చచ్చిపోయే పరిస్థితి

    ఇప్పటికే థియేటర్ లీజు విధానంతో అన్ని థియేటర్లు కేవలం నలుగురి చేతిలో ఉండి తెలుగు సినీ పరిశ్రమ కొందరి కబంద హస్తాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే ఈ సమస్యతో చిన్న నిర్మాతలు సమస్యలు ఎదుర్కొంటుంటే.... మరో వైపు డిజిటల్ ప్రొవైడర్స్ వల్ల నిర్మాత చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది.... అని సాయి వెంకట్ తెలిపారు.

     వేల కోట్లు దండుకుంటున్నారు.

    వేల కోట్లు దండుకుంటున్నారు.

    డిజిటల్ ప్రొవైడర్స్ మీద వారు పెట్టుబడి పెట్టింది చాలా తక్కువ. కానీ ఇపుడు కోట్లు సంపాదిస్తున్నారు. ఒక తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే ఒక వెయ్యి థియేటర్లలో ఈ డిజిటల్ వ్యవస్థ ఉంది. ఇందుకోసం వారు 50 నుండి 100 కోట్లు ఖర్చు పెట్టారు. అంత చిన్న పెట్టుబడితో ఇపుడు రూ. 10 వేల కోట్లు వరకు లాభపడుతున్నారు. ఈ డబ్బంతా నిర్మాతల రక్తం. ఈ సమస్య సాల్వ్ అయ్యే వరకు థియేటర్ల బంద్ కొనసాగుతూనే ఉంటుంది అని.... సాయి వెంకట్ తెలిపారు.

     పవన్, చిరు, బాలయ్య స్పందించాలి

    పవన్, చిరు, బాలయ్య స్పందించాలి

    థియేటర్ల బంద్ విషయమై ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి ఎవరూ మీడియా ముందుకొచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. ఈ విషయమై వారు స్పందించి, నిర్మాతలకు, థయేటర్ల బంధ్‌కు మద్దతు ఇవ్వాలి.... అని సాయి వెంకట్ తెలిపారు.

    English summary
    Telangana Producer Council Secretary Lion Sai Venkat demands Chiranjeevi, Balakrishna, Pawan Kalyan and other should talk about theaters strike.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X