twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథనే మెయిన్ హీరో.. 'సత్య గ్యాంగ్‌' గురించి నిర్మాత మహేశ్‌ ఖన్నా

    By Rajababu
    |

    సాత్విక్‌ ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేస్తూ సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్‌'. ఈ చిత్రానికి ప్రభాస్‌ దర్శకత్వంతోపాటు సంగీతం అందించగా, మహేశ్‌ఖన్నా దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 6న విడుదల కానుంది.

    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ''ఏప్రిల్‌ 6న సత్యగాంగ్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నేను ఎన్నో సినిమాల్లో నటించాను. సినిమా తియ్యడం మాత్రం మొదటిసారి. కమర్షియల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా సినిమా తియ్యడం జరిగింది. జనరల్‌గా సినిమాల వల్ల ఎంతో మంది ఇన్‌స్పైర్‌ అవుతారు. సినిమాలో మనం ఇచ్చే కన్‌క్లుజన్‌ బాగుండాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రేక్షకులే కాదు దేశంలోని యువత మొత్తం ఏవిధంగా ఉండాలి, ఒకవేళ పొరపాటు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందనేది చెప్పడం జరిగింది అని అన్నారు.

     Producer Mahesh Khanna about Satya Gang movie

    జనరల్‌గా ప్రతి తల్లి కూతురితో అన్ని విషయాలు క్లోజ్‌గా మాట్లాడుతుంది. అదే తండ్రి విషయానికి వస్తే తనకు బాధ వున్నా, కోపం వున్నా అన్నీ మనసులోనే దాచుకుంటాడు. పిల్లల్ని అందరూ ప్రేమగా పెంచుతారు. పిల్లలు ఎలాంటి తప్పులు చేస్తున్నారనేది తెలియనంతగా తమ ప్రేమను పంచుతారు. వాళ్ళు తప్పులు చేస్తే పరిణామం ఎలా ఉంటుంది. తర్వాతి తరానికి ఇది ఏవిధంగా ఎఫెక్ట్‌ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్‌. ఒకరు తప్పు చేస్తే దానికి కుటుంబం మొత్తం బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చిత్రం ద్వారా ఎవరైనా తప్పు చేస్తే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఐడెంటిఫై చేస్తుంది.

    ఆడది అర్థరాత్రి ఒంటరిగా తిరగగలిగినప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీగారు చెప్పారు. ఈ చిత్రం ద్వారా భవిష్యత్తులో మగ పిల్లవాడైనా సరై అర్థరాత్రి ఒంటరిగా తిరగడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. ఏదైనా తప్పు చెయ్యాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే నలుగురు అనాథ కుర్రాళ్ళు ఉంటారు. వారి వల్ల ఒక క్రైమ్‌ జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది సినిమా.

    చదువనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువే జీవితం కాదు. ఈ సినిమాకి కథే మెయిన్‌ హీరో. మా పెద్దబ్బాయి మైనింగ్‌ ఇంజనీర్‌, రెండో అబ్బాయి ఈ సినిమా స్టార్ట్‌ చేసే టైమ్‌కి ఇంటర్‌ సెకండియర్‌. ఈ సినిమా ఓపెనింగ్‌ టైమ్‌లో చాలా మంది పెద్దవారికి అబ్బాయికి బ్లెస్సింగ్స్‌ ఇచ్చారు. నేను వాడికి ఒకటే చెప్పాను నువ్వు ఇంటర్‌ ఫెయిల్‌ అయినా ఫర్వాలేదు. డాన్స్‌పైన, యాక్టింగ్‌పైన కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యమని చెప్పాను. అయితే ఎగ్జామ్స్‌కి వారం ముందు వాడిని వదిలాం. ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాడు. డిగ్రీ ఇక్కడే జాయిన్‌ చేశాం. ఈ సినిమాలో డాన్సులు బాగా చేశాడు. తప్పకుండా సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో సుమన్‌గారు, సుహాసినిగారు, బాహుబలి ప్రభాకర్‌, షఫీ, వినోద్‌, రాజేందర్‌, దిల్‌ రమేష్‌ ముఖ్యపాత్రలు చేశారు. నేను కూడా ఒక క్యారెక్టర్‌లో నటించాను. దైవసంకల్పం వల్లే ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. ఈ సినిమాని 150 థియేటర్లలో రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నాం'' అన్నారు.

    English summary
    Starring Sathvik Eshvar, Pratyush, Akshita and Harshitha Singh in lead roles and directed by Nimmala Prabhas, Satya Gang features five songs on the album composed by Prabhas. This movie set to release on April 6th. In this occassion, Producer Mahesh Khanna speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X