నా నువ్వే డిజాస్టర్‌పై నిర్మాత ఎమోషనల్.. ఫైటర్‌గా మారుతాం..

By Rajababu

నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నా నువ్వే చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే అతిసున్నితమైన ప్రేమ కథగా రూపొందిద్దుకొన్న ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. కొన్నేళ్లుగా జర్నలిస్టుగా సేవలందించిన మహేష్ కోనేరు తొలిసారి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని రూపొందించారు. తొలి చిత్రమే కొంత చేదు అనుభవాన్ని మిగిల్చడంతో సోషల్ మీడియాలో ఎమోషనల్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

ఫలితాన్ని ఒప్పుకోరు..

ఫలితాన్ని ఒప్పుకోరు..

సాధారణంగా ఏ సినిమా నిర్మాతనైనా మొదటి వారమే తన చిత్రం ఫెయిల్ అయిందని ఒప్పుకోవడం కనిపించదు. దారుణమైన ఫలితం ఎదురైనప్పటికీ దానిని దాచడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్తగా పోస్టర్లు కొట్టించి బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేసుకొంటారు.

భిన్నంగా మహేష్ కోనేరు

భిన్నంగా మహేష్ కోనేరు

సినిమా ఇండస్ట్రీలో సొంత డబ్బా కొట్టుకొనే లాంటి వాటికి భిన్నంగా మహేష్ కోనేరు నిలిచారు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకొన్న నేపథ్యంలో నా నువ్వే చిత్రం గురించి ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.

బాగా నిరాశపరిచింది..

బాగా నిరాశపరిచింది..

అవును. చాలా బాధగా ఉంది. బాగా నిరాశపరిచింది. మా ప్రాణం పెట్టి సినిమాను రూపొందించాం. ప్రతీ ఒక్కరం చాలా కష్టపడ్డాం. మళ్లీ మరో సినిమాతో హిట్ అందుకోవడానికి ప్రయత్నిస్తాం అని ట్వీట్ చేశారు. సినిమా అంటే అమితమైన ప్రేమ ఉంది. అదే మమల్ని ఇంతదూరం ప్రయాణించేలా చేసింది అని తన ట్వీట్‌లో వెల్లడించారు.

Recommended Video

Naa Nuvve Movie Review నా నువ్వే మూవీ రివ్యూ

మరో హిట్టు కోసం ఫైట్

అలాగే ఈ రోజు ఫ్లాప్ వచ్చిందంటే.. మరో రోజు హిట్టు కొట్టడానికి ఫైటర్‌గా మారుతాం. ఈసారి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం. మళ్లీ ఇంతకంటే ఎక్కువగా కష్టపడుతాం. ఈ ప్రయాణంలో మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జీవిత ప్రయాణం ఆగదు అని మహేష్ కోనేరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X