Don't Miss!
- Sports
వచ్చే సీజన్ ఆరో ట్రోఫీ పక్కా.. హామీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
- News
టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి బొత్స కామెంట్స్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మంచు మోహన్ బాబు ఇంట విషాదం
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు.

ఈ సాయంత్రం 4 గంటలకు
మంగళవారం సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మోహన్ బాబు నటించిన పలు సినిమాలకు వెంకటాద్రినాయుడు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు.

సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు
వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటాద్రినాయుడు మృతి విషయం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నారావారి పల్లెలో తుది వీడ్కోలు
మోహన్ బాబు కుటుంబసబ్యులు సహా పలువురు సినీ ప్రముఖులూ, రాజకీయ నేతలూ నారా వారి పల్లెలో ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు. ఆ మధ్య వరుసగా సినీ పరిశ్రమకి చెందిన నటులూ, దర్శకుల మరణాలు తెలుగు ఇండస్ట్రీని కొంత కలవర పెట్టాయి.

కొన్నేళ్ళుగా సినిమాలకి దూరం
కొంత
కాలంగా
ప్రశాంతంగా
ఉన్న
టాలీవుడ్
మేడసాని
మృతి
తో
మళ్ళీ
విషాదం
లో
మునిగి
పోయింది.
గత
కొన్నేళ్ళుగా
సినిమాలకి
దూరంగానే
ఉన్న
ఆయన
శ్రీవిద్యానికేతన్
విద్యాసంస్థల
కోశాధికారిగా
కూడా
వ్యవహరించి
ప్రస్తుతం
స్వగ్రామం
లోనే
విశ్రాంతిగా
గడుపుతున్నారు.

బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా
తెలుగు ఇండస్ట్రీలో 1980,90 దశకాల్లో వచ్చిన సినిమాలకు వేంకటాద్రి నాయుడు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. వాటిలో మోహన్ బాబు సినిమాలు కూడా ఉన్నాయి. సొంత బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా చెప్పుకునే వేంకటాద్రి నాయుడు మరణం మంచు మోహన్ బాబు కి మరింత ఎక్కువ భాదనే కలిగించిందట.