twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు దాసరి, తమ్మారెడ్డి, నారాయణమూర్తి..ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా..అధిక టికెట్ల రేట్లపై ఎంఎస్ రాజు ఆగ్రహం

    |

    మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్' ఈ శుక్రవారం విడుదలైంది. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా... మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అన్ని ఏరియాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోన్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.

    టికెట్ రేట్లు అధికంగా ఉండటం వల్ల మన సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యిందనేది చాలా మంది ఉద్దేశం. అది ఎవరూ బయటపడరు. ఎందుకంటే... పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ పాన్ ఇండియా హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిలా, కె బాలచందర్ గారిలా చిన్న సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే? ఈ రోజు 'హ్యాపీ డేస్' లాంటి సినిమాలు వస్తే? ఏంటని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీ తాలూకా పోకడ మారింది. ఎందుకు మారిందంటే... ఈ రోజు ఫోనులో ప్రతిదీ అందుబాటులో ఉంది. చాలా ఓటీటీ వేదికలు వచ్చాయి. ఈ పోటీలో కరోనా ఒకటి. నేను పెద్ద పెద్ద సినిమాలు తీశాను. లో బడ్జెట్ సినిమాలు తీశాను. అప్పుడు టికెట్ ధర ప్రేక్షకులకు అందుబాటులో ఉండేది అని ఎంఎస్ రాజు అన్నారు.

    Producer MS Raju questions High Ticket rates in Telugu States

    ప్రస్తుతం ఇప్పుడు పెద్ద సినిమాలకు టికెట్ రేటు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అంతా హ్యాపీ. నా రిక్వెస్ట్ ఏంటంటే... పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోండి. చిన్న సినిమాలకు, నాలుగు కోట్ల బడ్జెట్ లోపు సినిమాలకు రేట్లు తగ్గించండి. నేను ఒక థియేటర్‌కు వెళితే... టికెట్ రేటు 200 పెట్టారు. చిన్న సినిమాకు అంత డబ్బులు పెట్టి నేను ఎందుకు చూస్తాను? మా సినిమాకు టాక్ బావుంది. జనాలు వస్తున్నారు. ఏవరేజ్ ఫిల్మ్ అయితే ఓటీటీలో వస్తే చూద్దామని అనుకుంటున్నారు. ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి టికెట్ రేటు ఎంత తగ్గిస్తారు? 30 శాతమా? 40 శాతమా? నేను చిన్న సినిమా తీశానని, లేదంటే నా సినిమా కోసమో అడగటం లేదు. గతంలో దాసరి గారు, ఆ తర్వాత భరద్వాజ్ గారు, నారాయణమూర్తి గారు అడిగారు. ఇవాళ నేను అడుగుతున్నాను అని ఎంఎస్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

    నా సినిమా కోసం అయితే విడుదలకు ముందు చెప్పేవాడిని. చిన్న సినిమా కోసం ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే ఇదొక పెద్ద సినిమాల ఇండస్ట్రీగా ఉంటుంది తప్ప చిన్న సినిమాల ఇండస్ట్రీగా ఉండదు. చిన్న చిన్న సినిమాలు తీయాలనుకునే ఔత్సాహిక దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ 'నేను ఓటీటీకి వెళ్లాలా? థియేటర్లకు రాలేనా?' అని ఎందుకు అనుకోవాలి. నాకు అర్థం కావడం లేదు... థియేటర్లలో పెద్ద పెద్ద సినిమాలే విడుదల చేయాలా? దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పెద్ద సినిమాలకు ఎంత రేట్ అయినా పెట్టుకోండి. క్రేజ్ ఉంది కాబట్టి థియేటర్లకు జనాలు వస్తారు. చిన్న సినిమాకు ఏదైనా చేయండి. లేదంటే చిన్న సినిమా రాదు అని ఎంఎస్ రాజు అన్నారు.

    English summary
    7 days 6 nights movie getting good response at box office. Movie unit celebrated success meet at hyderabad. In this function, Producer MS Raju made sensational comments on Ticket rates in Telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X