twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాను చంపేయకండి.. అంత ధర పెడితే ఎవరు చూస్తారు? టికెట్ల రేట్లపై ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు

    |

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టికెట్ల రేట్ల వివాదం రోజుకు రోజకు పెరుగుతూనే ఉంది. థియేటర్‌లో టికెట్ రేట్లు సాధారణ పౌరులకు అందుబాటులో లేకపోవడం వల్ల ఆక్యుపెన్సీ నిరాశజనకంగా ఉంది. అయితే చిన్న సినిమా పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రూపొందించిన 7 days 6 nights చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో శుక్రవారం (జూన్ 24వ తేదీ) సాయంత్రం 7 days 6 nights మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికాశెట్టి, నిర్మాత రజనీకాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ..

    మా సినిమా అంచనాలు మించి..

    మా సినిమా అంచనాలు మించి..

    7 days 6 nights చిత్రానికి మంచి స్పందన లభిస్తున్నది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. మౌత్ టాక్‌తో శంకరాభరణం, సాగరసంగమం లాంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. మా సినిమాకు మౌత్ టాక్‌తో ప్రతీ షోకు వసూళ్లు, ఆక్యుపెన్సీ పెరుగుతున్నది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు మించింది అని ఎంఎస్ రాజు అన్నారు.

    చిన్న సినిమాకు టికెట్ రేట్లు శాపంగా

    చిన్న సినిమాకు టికెట్ రేట్లు శాపంగా

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల విధానం చిన్న సినిమాలకు శాపంగా మారాయి. టికెట్ల రేట్ల పెంపు గురించి సినిమా పెద్దలు ప్రభుత్వాలతో చర్చించారు. కానీ నాలాంటి పెద్ద నిర్మాతను పరిగణనలోకి తీసుకోలేదు. నేను స్టార్ స్టేటస్‌లో వెనకబడటం వల్ల నాకు ఆహ్వానం అందలేదో ఏమో. కానీ థియేటర్లలో పెద్ద సినిమాలకే రెస్పాన్స్ రావడం లేదు. చిన్న సినిమాలకు టికెట్లు తెగే పరిస్థితి కనిపించడం లేదు. సినిమా బాగున్నా ఓటీటీలో చూద్దాంలే అనే భావనలో ప్రేక్షకులు ఉన్నారు. అందుకు కారణం టికెట్ రేట్లే కారణం అని ఎంఎస్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితి

    ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితి

    ప్రస్తుతం సింగిల్ థియేటర్‌లో 150 నుంచి 200 రూపాయల వరకు సినిమా టికెట్ ధర ఉంది. చిన్న సినిమాకు అంత రేటు పెడితే.. సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితి. చిన్న సినిమాలు బతకాలంటే.. ఆ సినిమాకు తగినట్టు టికెట్ ధర ఉండాలి. అప్పుడే సినిమా బతికి బట్టకడుతుంది. లేదంటే.. అధిక టికెట్ ధర కారణంగా సినిమా చావడం తప్ప మరో ఫలితం ఉండదేమో అనే ఎంఎస్ రాజు అన్నారు.

    సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా

    సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా

    టికెట్ల రేట్ల విధానం ఇలానే ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగానే ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ అంటే.. పెద్ద సినిమాల ఇండస్ట్రీగానే మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక నిర్మాతలు, సినిమాపై అభిరుచి ఉన్న నిర్మాతలు సినీ నిర్మాణానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంది. సినిమా పరిశ్రమ పరిస్థితి మెరుగుపడాలంటే.. ప్రభుత్వాలు, సినీ పెద్దలు తగిన నిర్ణయం తీసుకోవాలి అని ఎంఎస్ రాజు పేర్కొన్నారు.

    తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రిక్వెస్ట్

    తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రిక్వెస్ట్

    తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు అవుతున్న టికెట్ రేట్ల విధానాన్ని సమీక్షించాలి. సినిమాలను ముఖ్యంగా చిన్న సినిమాలను కాపాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పెట్టిన అధిక ధరల వల్ల చిన్న సినిమాలను చూడటానికి ప్రేక్షకులు రావడం లేదు. కాబట్టి దయచేసి చిన్న సినిమాల విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలనేది నా మనవి అని ఎంఎస్ రాజు తెలిపారు.

    English summary
    7 days 6 nights movie getting good response at box office. Movie unit celebrated success meet at hyderabad. In this function, Producer MS Raju made sensational comments on Ticket rates in Telugu states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X