ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్‌ బాబుకు ట్వీట్

నమ్రత శిరోద్కర్.. తెలుగు సినీ ప్రియులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన ఈమె.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్రేమాయణం సాగించి.. వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అతడికి అండగా ఉంటూ.. అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఉంటోంది. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత విషయంలో నమ్రత శిరోద్కర్ ఓ పొరపాటు చేసింది. దీంతో ఆయన మహేశ్‌కు ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

మిస్ ఇండియా నుంచి పరిశ్రమలో

మిస్ ఇండియా నుంచి పరిశ్రమలో

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది నమ్రత శిరోద్కర్. ఆ సమయంలోనే 1993లో జరిగిన అందాల పోటీల్లో 'మిస్ ఇండియా యూనివర్స్', 'మిస్ ఇండియా ఏషియా పసిపిక్' కిరీటాలను దక్కించుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో 1998 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' అనే హిందీ చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

 ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు

ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు

బాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే నమ్రత శిరోద్కర్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'వంశీ'తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'అంజీ' అనే సినిమానూ చేసింది. ఇది కూడా బాక్సాఫీస్ ముందు దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

మహేశ్‌తో సీక్రెట్ ప్రేమ.. వివాహం

మహేశ్‌తో సీక్రెట్ ప్రేమ.. వివాహం

'వంశీ' సినిమా చేస్తున్న సమయంలోనే మహేశ్ బాబుతో ప్రేమలో పడింది నమ్రత శిరోద్కర్. ఆ తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరూ రహస్యంగా ప్రేమాయణం సాగించారు. అలా దాదాపు నాలుగేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పేశారు. ఈ క్రమంలోనే 2005లో అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

మహేశ్‌ బాబుకు అన్నీ తానైంది

మహేశ్‌ బాబుకు అన్నీ తానైంది

వివాహం జరిగిన కొన్నేళ్ల పాటు ఇంటికే పరిమితం అయింది నమ్రత శిరోద్కర్. ఆ తర్వాత సినీ రంగంలో యాక్టివ్ అయిన ఆమె.. మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. డేట్స్, స్టోరీ డిస్కర్షన్స్, స్టైల్స్, యాడ్స్, బిజినెస్ ఇలా అన్నింటిలోనూ తన మార్క్ చూపిస్తోంది. ఈ క్రమంలోనే అడవి శేష్ 'మేజర్' సినిమాను సొంత బ్యానర్‌పై నిర్మిస్తోంది.

 నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత

నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత

మహేశ్ బాబు కెరీర్‌నే మలుపు తిప్పిన సినిమాగా 'ఒక్కడు'ను చెబుతుంటారు. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక, ఈ మూవీ శుక్రవారంతో 18 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దీనిని పురస్కరించుకుని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో చిత్ర నిర్మాత ఎంఎస్ రాజుకు భారీ షాకిచ్చింది.

 మహేశ్‌కు ట్వీట్ చేసిన నిర్మాత

మహేశ్‌కు ట్వీట్ చేసిన నిర్మాత

'ఒక్కడు' చిత్రం 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పిన నమ్రత.. అందులో అందరి పేర్లు పెట్టి.. నిర్మాత ఎంఎస్ రాజును మర్చిపోయింది. దీంతో ఆయన తన ట్విట్టర్‌లో 'మహేశ్.. నమ్రత గారు చేసిన పోస్టులో నా పేరును పెట్టడం మర్చిపోయారు. అయినా.. ఇది ఆమె క్లాసిక్ సినిమా అని చెప్పినందుకు సంతోషంగా ఉంది' రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X