twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమంత్ పెళ్లిపై ఎమ్మెస్ రాజు ట్వీట్: ఇబ్బందిగా ఉన్నా తప్పట్లేదు.. ప్రైవేట్‌గా చేసుకోవడంపై ఇలా!

    |

    గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సంవత్సరం కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌గా ఉన్న మరికొందరు ఆర్టిస్టులు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు కుమారుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. రెండు రోజులుగా హాట్ టాపిక్ అవుతోన్న ఈ న్యూస్‌పై తాజాగా రాజు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో కొడుకు పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

    సుమంత్ కెరీర్‌ మొదలైంది ఆ సినిమాతోనే

    సుమంత్ కెరీర్‌ మొదలైంది ఆ సినిమాతోనే

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరొందారు దిగ్గర నిర్మాత ఎమ్మెస్ రాజు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన.. పలు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. ఈ క్రమంలోనే తన కుమారుడు సుమంత్ అశ్విన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. 'తూనీగ తూనీగ' అనే సినిమాతో హీరోగా అతడి కెరీర్ మొదలైంది. దీనిని అతడి తండ్రే తెరకెక్కించారు.

    ఆ రెండే హిట్.. మిగిలినవన్నీ పరాజయాలే

    ఆ రెండే హిట్.. మిగిలినవన్నీ పరాజయాలే

    చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. సుమంత్ అశ్విన్ కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. ఇప్పటి వరకూ పదకొండు సినిమాల్లో నటించగా.. 'అంతకు ముందు ఆ తర్వాత', 'కేరింత' మాత్రమే డీసెంట్ హిట్లుగా నిలిచాయి. మిగిలినవన్నీ నిరాశనే మిగిల్చాయి. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. నటుడిగా మాత్రం సుమంత్ పైపైకి ఎదుగుతున్నాడనే చెప్పాలి.

    మల్టీస్టారర్ మూవీతో రాబోతున్న సుమంత్

    మల్టీస్టారర్ మూవీతో రాబోతున్న సుమంత్

    సుమంత్ అశ్విన్ ప్రస్తుతం 'ఇదే మా కథ' (రైడర్స్ స్టోరి) అనే సినిమాలో నటిస్తున్నాడు. గురు పవన్ తెరకెక్కిస్తోన్న సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడు. వీళ్ళకు జోడీగా భూమిక, తాన్యా హోప్ చేస్తున్నారు. పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై జి.మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

    పెళ్లి కొడుకు కాబోతున్న సుమంత్ అశ్విన్

    పెళ్లి కొడుకు కాబోతున్న సుమంత్ అశ్విన్

    జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు సుమంత్ అశ్విన్. కెరీర్ ఎలా ఉన్నా పర్సనల్‌ లైఫ్ విషయంలో అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. అవును.. కొద్ది రోజుల్లోనే ఈ యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 13న దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ అంశం రెండు రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది.

    సుమంత్ పెళ్లిపై ఎమ్మెస్ రాజు ట్వీట్ వైరల్

    సుమంత్ పెళ్లిపై ఎమ్మెస్ రాజు ట్వీట్ వైరల్

    సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అతడి కుటుంబం నుంచి దీనిపై ప్రకటన మాత్రం రాలేదు. దీంతో ఇది నిజమా? కాదా? అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బడా ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు ట్విట్టర్ వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 13నే చిలసౌ.. దీపికతో సుమంత్ అశ్విన్ పెళ్లి జరుగుతున్నట్లు అందులో ప్రకటించారాయన.

    Recommended Video

    Prabhas 21 : Nag Ashwin Repeats Mahanati Crew | Deepika Padukone | Prabhas
    ఇబ్బందిగా ఉన్నా తప్పట్లేదు.. ప్రైవేటుగానే

    ఇబ్బందిగా ఉన్నా తప్పట్లేదు.. ప్రైవేటుగానే

    సుమంత్ పెళ్లిపై స్పందిస్తూ.. 'మా కొడుకు సుమంత్ పెళ్లి గురించి ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుకను ప్రైవేటుగానే చేయాలని నిర్ణయించాం. మీ రాకను మిస్ అవుతున్నందుకు ఇబ్బందిగా ఉన్నా ఇది తప్పడం లేదు. ఈ నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము' అని రాసుకొచ్చారు ఎమ్మెస్ రాజు.

    English summary
    Sumanth Ashwin is an Indian actor who appears in Telugu films. Son of film producer and director M. S. Raju, Ashwin made his debut in 2012 with Tuneega Tuneega under his father's direction. He later starred in films such as Kerintha and Columbus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X