ఫ్లాఫ్ సినిమాకి...సీక్వెల్ తీస్తానంటారేంటి గురూ
చెన్నై : సాధారణంగా సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తూంటాయి. కానీ ఫ్లాఫ్ సినిమాలకు కూడా సీక్వెల్ తీస్తాననటం ఆశ్చర్యే అంటున్నారు. ఇంతకీ ఆ ప్లాఫ్ సీరియల్ మరేదో కాదు...రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ తెరకెక్కించిన సినిమా 'కోచ్చడయాన్'(విక్రమ్ సింహా). త్రీడీ మోషన్ కేప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన చిత్రమిది. ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పించింది. మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ రూపొందించింది. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు నిర్మాత మాత్రం సీక్వెల్ తీస్తానంటున్నాడు.
సహ నిర్మాత మురళీ మనోహరన్ మాట్లాడుతూ "మాకున్న బడ్జెట్‌ని, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మేం అద్భుతాలను చేశాం. ఈ విషయాన్ని పలువురు ప్రతిభావంతులు సైతం ఒప్పుకున్నారు. 'కోచ్చడయాన్'కన్నా సీక్వెల్‌ను ఇంకా బాగా చేస్తాం. ఎక్కువ కష్టపడతాం'' అని అన్నారు.

అలాగే సినిమా వర్కవుట్ కాలేదా అని మీడియావారు అడిగితే... "త్రీడీ మోషన్ కేప్చర్ విధానంలో రజినీకాంత్‌ను చూడటం దక్షిణాది వారికి థ్రిల్‌గా అనిపించింది.ఉత్తరాది ప్రేక్షకులు అంతగా రిజీవ్ చేసుకోలేకపోయారు. ఆ విషయం కాస్త నిరాశపరచింది'' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











