త్రివిక్రమ్ కారణంగానే పవన్ కళ్యాణ్ అలాంటి నిర్ణయాలు.. ఆ కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నగవంశీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఎక్కువ స్థాయిలో రీమేక్ సినిమాలను లైన్లోకి తీసుకువస్తూ ఉండడంతో ఓవర్గం ప్రేక్షకుల నుంచి మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కారణంగానే అలాంటి సినిమాలు చేయడానికి ఒప్పుకుంటున్నాడు అని చాలా రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ క్రమంలో త్రివిక్రమ్ పై కూడా ఓ వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అసలు పవన్ కథల సెలక్షన్స్ విషయంలో త్రివిక్రమ్ ప్రభావం ఎంతవరకు ఉంది అనే విషయంలో ఇటీవల నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి స్నేహితులుగా..
త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. జల్సా సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమాలు చేసిన చేయకపోయినా కూడా ఇద్దరు కూడా వీలైనంతవరకు ఖాళీ సమయాల్లో అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అత్యంత క్లోజ్ గా ఉండే వ్యక్తి త్రివిక్రమ్ అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.

త్రివిక్రమ్ సలహాలు నిజమేనా?
ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ కు కథ చెప్పేముందు చాలామంది త్రివిక్రమ్ కలుస్తూ ఉన్నారు అనే టాక్ ఉంది. పవన్ ఇతర పనుల్లో చాలా బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని కలిసేందుకు కొంతమంది ప్రముఖ నిర్మాతలకు కూడా దారి దొరకడం లేదు. అందుకే త్రివిక్రమ్ ముందుగా కలుస్తున్నారని ఇక రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి బహుశా త్రివిక్రమ్ సలహా మేరకు పవన్ కళ్యాణ్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉండవచ్చు అని ఒక టాక్ కూడా వినిపిస్తోంది.

మరో రెండు రీమేక్ సినిమాలు
ఇక గతంలో అయితే దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా కథ చెప్పాలని అనుకున్నప్పుడు మొదటగా త్రివిక్రమ్ కలిసినట్లుగా చాలా ఓపెన్ గానే తెలియజేశారు. త్రివిక్రమ్ సలహా మేరకు ఆ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది అని ఆయన ఒక స్టేజ్ పైన వివరణ ఇచ్చాడు. ఇక తర్వాత భీమ్లా నాయక్ కథ కూడా త్రివిక్రమ్ కదా రచనలో పవన్ కళ్యాణ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు రీమేక్ సినిమాలే. ఇక ప్రస్తుతం కూడా వినోదయ సీతం రీమేక్ తో పాటు తేరే రీమేక్ కూడా పవన్ చేస్తున్నాడు. ఇది కూడా త్రివిక్రమ్ సలహా మేరకు చేస్తూ ఉండవచ్చు అని టాక్ కూడా వస్తోంది.

ఫ్యాన్స్ ఆగ్రహం
దీంతో సోషల్ మీడియాలో అయితే ఓ వర్గం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ఇస్తున్న సలహాలు ఇస్తున్నారు అనే వార్తలు నిజం అనుకొని సీరియస్ అవుతున్నారు. వీలైనంతవరకు త్రివిక్రమ్ సలహా తీసుకోకుండానే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఒరిజినల్ కథలు చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక చాలామంది దర్శకులు పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకుంటున్నారని కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నాగవంశీ క్లారిటీ..
అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ అనుబంధం గురించి ఒక వివరణ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎలాంటి సమయం దొరికినా కూడా వారు మాట్లాడుకోవడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అని తెలియజేశాడు. అంతేకాకుండా ఒకరు సినిమాల విషయంలో మరొకరి ప్రమేయం ఎంత మాత్రం ఉండదని.. కానీ ఎలాంటి సినిమా చేస్తున్నారు అనే విషయంలో మాత్రం ఒకరికొకరు చర్చించుకుంటారు అని నాగ వంశీ తెలియజేశాడు.

ఎలాంటి ప్రభావం చూపరు..
ఫైనల్ గా అయితే నాగ వంశీ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చేసే ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ప్రభావం చూపరు అని ఆయన డైరెక్టుగా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న తర్వాతనే దర్శకుడు నిర్మాత అందరూ కూడా ఫైనల్ అవుతారు అని కూడా తెలుస్తోంది. ఇక పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇక ఓజి ప్రాజెక్ట్, హరిష్ శంకర్ సినిమాలు కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











