KA, హనుమాన్‌కు సింపతి కార్డు వర్కవుట్.. గుంటూరు కారం, లక్కీ భాస్కర్‌కు అదే నెగిటివిటి.. నిర్మాత షాకింగ్ కామెంట
ఎంత కాదు లేదు అనుకున్నా కొన్ని సందర్భాల్లో పలు కొలమానాలు రీత్యా ఆయా సినిమాలు చిన్న పెద్ద అనే కేటగిరీ టాపిక్ తప్పకుండా వచ్చి తీరుతుంది. కొందరు చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు అన్నీ ఒకటే అంటారు కానీ ఒక టైం లో మాత్రం ఇదే పెద్ద తలనొప్పి తీసుకొస్తుంది అని చెప్పాలి. ఇంకా పలు పండుగలు లేదా ఒకే డేట్ లో రెండు మూడు సినిమాలు ఉంటే ఆ సమయంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పాలి.
కాగా ఇటీవల తెలుగు సినిమా దగ్గర నెలకొన్న కాంపిటేషన్ లో పలు సినిమాలకి ఆడియెన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది తెలిసిందే. అయితే బాగా హైలైట్ అయ్యిన రెండు సందర్భాల్లో మాత్రం ఒక నిర్మాతే బాగా కామన్ గా కనిపిస్తున్నారని చెప్పాలి. కాగా ఆ నిర్మాత ఎవరో కాదు రీసెంట్ గా లక్కీ భాస్కర్ అనే సినిమాతో వచ్చి 100 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ..

అయితే తమ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ ఏడాది మొదటి సినిమా "గుంటూరు కారం". సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాతో పాటుగా అపుడు చిన్న సినిమా "హను మాన్" కూడా వచ్చింది. చిన్న హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమాని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.
అయితే అప్పటికి హీరో, నిర్మాత, దర్శకుడు వీరంతా గుంటూరు కారం యూనిట్ ముందు చిన్నవారే అయినా కూడా పట్టుపట్టి కొంచెం థియేటర్స్ తక్కువే ఉన్నా కూడా వచ్చారు. అయితే అపుడు ఆ సినిమా కోసం సింపతి డ్రామా చేసుకొని వర్కౌట్ చేసుకున్నారని పలు కామెంట్స్ ఉన్నాయి. వీటిపై ఇటీవల నాగవంశీ కూడా స్పందించారు.

అయితే మళ్ళీ ఇదే నిర్మాత మళ్ళీ పోటీలో సినిమాకి వచ్చినపుడు మరో చిన్న సినిమా "క" విషయంలో కూడా థియేటర్స్ దొరకకుండా చేస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. దీనితో ఈ రెండు సినిమాలకి కూడా ఒక సింపతే ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యింది అన్నట్టుగా లేటెస్ట్ బాలయ్య డాకు మహారాజ్ టైటిల్ టీజర్ అనౌన్సమెంట్ లో మీడియా ప్రముఖులు వేసిన ప్రశ్నకి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. అలాగే ఈసారి వస్తున్నా మా సినిమాకి మేము సింపతీ ప్లే చెయ్యాలి ఏమో అన్నట్టు కూడా కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దీనితో మరోసారి ఆ రెండు సినిమాలని మాత్రం కొంచెం వెటకారంగానే మాట్లాడినట్టు అనిపించక మానదు. ఇక వీరి నుంచి వస్తున్నా డాకు మహారాజ్ కూడా ఈ ఏడాది వచ్చిన తమ సినిమా అలాగే అదే సినిమాతో వచ్చిన వీరు అంటున్న సింపతి సినిమా హను మాన్ డేట్ జనవరి 12 లోనే మళ్ళీ వస్తుండడం గమనార్హం. ఇప్పుడు అయితే ఈ డేట్ ని వీరే ముందు లాక్ చేసుకున్నారు. మరి ఆ డేట్ లోకి వేరే ఏ సినిమా వారు అయినా వస్తారో లేదా ఈ డేట్ లో వారికి సోలో రిలీజ్ ఉంటుందో ఏమో అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











