‘డాకు మహారాజ్’ కలెక్షన్లపై నిర్మాత నాగ వంశీ షాకింగ్ కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే?
Daaku Maharaj: నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా నేడు వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అనుకున్న విధంగానే భారీ రెస్పాన్స్ వస్తుంది. తొలి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సంక్రాంతి రేసులో బాలయ్య ను డాకు మహారాజ్ నిలబెట్టిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ నాగ వంశీ డాకు మహారాజ్ కలెక్షన్స్, తెలంగాణ లో బెనిఫిట్ షోస్ రద్దు పై షాకింగ్ కామెంట్స్ చేశారు..
బాలయ్య బాబు హీరోగా.. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మాహారాజ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ద శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే చాందినీ చౌదరి గెస్ట్ రోల్ నటించింది. ఇక బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో కలిసి మాస్ స్టెప్పులేసింది. అనుకున్న విధంగా డాకు మహారాజ్‍కు పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ డాకు మహారాజ్ కలెక్షన్స్, తెలంగాణ లో బెనిఫిట్ షోస్ రద్దు, సక్సెస్ ఈవెంట్, ప్రీక్వెల్ వంటి విషయాలపై మాట్లాడారు. తొలుత సక్సెస్ ఈవెంట్ గురించి ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ.. డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ ను అనంతపురంలో లో ఈ వారం రోజులోనే నిర్వహిస్తామని ప్రకటించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ కావడంతో అక్కడి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారని, దీంతో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించాలని బాలకృష్ణ డిసైడ్ చేశారని తెలిపారు.
డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో జనవరి 9 నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడంతో వారికి సంతాపం తెలుపుతూ మూవీ యూనిట్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసింది. ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో సక్సెస్ ఈవెంట్ ను అనంతపురంలో నిర్వహించాలని డిసైడ్ అయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
డాకు మహారాజ్ సినిమా ఫ్రీక్వెల్ లేదా సీక్వెల్ ఉంటుందని ప్రశ్నించగా.. నాగ వంశీ స్పందిస్తూ.. ఈ సినిమాకు సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకే సినిమాలో కొన్ని ఇంట్స్ ఇచ్చామని తెలిపారు. అదే తల లేని వ్యక్తి కథను ఫ్రీక్వల్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే డాకు మహారాజ్ సినిమాను తమిళం, హిందీ భాషలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని, ఈ మేరకు ప్రింట్ ను సెన్సార్ కు పంపించామని తెలిపారు ప్రొడ్యూసర్ నాగవంశీ. అన్ని సెట్ అయితే జనవరి 17న రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణలో బెనిఫిట్ షోలు లేకపోవడంపై ప్రొడ్యూసర్ నాగ వంశీ రియాక్ట్ అయ్యారు. బెనిఫిట్ షో లు లేకపోవడం వల్ల కూడా తమకు మంచి జరిగిందని, ఆంధ్రాలో పాజిటివ్ టాక్ రావడంతో తెలంగాణలో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాయని, సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకోవడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. ఆంధ్రాలో, ఓవర్సీస్ లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక కలెక్షన్ల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము పాజిటివ్ టాక్ అందుకోవడమే పెద్ద విజయం గా భావిస్తున్నామని, కలెక్షన్ల గురించి తాము భయపడడం లేదని చెప్పుకొచ్చారు. అంత ముందుకు సోషల్ మీడియాలో నాగవంశీకి సంబంధించిన ఆడియో వైరల్ అయిన విషయం అందులో కూడా నాగ వంశీ కలెక్షన్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











