కరోనా సోకినా పవన్ కల్యాణ్ వెంటే ఆ నిర్మాత.. హాస్పిటల్‌కి స్వయంగా ఆయనే తీసుకెళ్ళి..!

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అందరినీ టెన్షన్ పెడుతోంది. మరీ ముఖ్యంగా రోజురోజుకు కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఒకపక్క సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు కూడా కొనసాగుతోంది.. నిన్న సాయంత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. నిజానికి నిన్న ఉదయం ఆయనకు స్వల్ప అస్వస్థత ఏర్పడగా ఆయన ముందు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. అయితే అప్పుడు నెగిటివ్ రావడంతో డాక్టర్ల సలహా మేరకు తన ఫాం హౌస్ లో క్వారెంటైన్ అయ్యారు. అయితే ఇంకా జ్వరం ఒళ్ళు నొప్పులు ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఆయనకు నిన్న సాయంత్రం పరీక్షలు చేయించుకోగా నిన్న సాయంత్రం కరోనా పాజిటివ్ అని తేలింది అలాగే ఊపిరితిత్తులలో నిమ్ము చేరడంతో యాంటీవైరల్ చికిత్స అందిస్తున్నారు.

నటుడు వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ ప్రముఖులు.. కన్నీరుమున్నీరైన అభిమానులు

 మహేష్ బాబు అభిమానుల పూజలు

మహేష్ బాబు అభిమానుల పూజలు


ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల పవన్ అభిమానుల లో టెన్షన్ రేకెత్తించింది. పవన్ కి ఆక్సిజన్ పెట్టినట్టుగా ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా వేదికగా పవన్ కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన కోలుకోవాలని పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం పూజలు చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ కు పూజలు చేస్తున్నట్లు ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం అన్న విషయం తెలిసినప్పటి నుంచి ఒక నిర్మాత ఆయన వెన్నంటే ఉన్నట్లు సమాచారం.

అందరిలా కాకుండా

అందరిలా కాకుండా

నిజానికి ఒక ప్రొడ్యూసర్ అంటే తన సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది ? తాను పెడుతున్న డబ్బు సరిగ్గా ఉపయోగ పడుతుందా లేదా ? ఎక్కడైనా దుర్వినియోగం అవుతోందా అనే విషయాలను పరిశీలిస్తూ ఉంటారు. కానీ తెలుగులో చాలా కొద్దిమంది నిర్మాతలు మాత్రం తనతో సినిమా చేసే హీరోలు అలాగే ఇతర నటీనటులతో చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అలాంటి వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ సూర్యదేవర ఒకరు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితం వరకు జరిగింది. పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రచారానికి వెళ్లాల్సి వచ్చిన కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్‌లు పడ్డాయి.

పవన్ కల్యాణ్ వెన్నంటే

పవన్ కల్యాణ్ వెన్నంటే

అయితే పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం బాగాలేదు అన్న విషయం తెలుసుకున్న వెంటనే నాగ వంశీ స్వయంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసి ఆయనే స్వయంగా హాస్పిటల్ కి టెస్టుల నిమిత్తం తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.. పవన్ కళ్యాణ్ కు సిటీ స్కానింగ్ చేయించగా అందులో కరోనా పాజిటివ్ అని తేలిందని సమాచారం. ఆ సిటీ స్కానింగ్ కూడా వంశీ దగ్గరుండి చేయించినట్లు సమాచారం. ఆ తెస్ లో పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో తదుపరి ఏమి చేయాలి అనే విషయాలు కూడా నాగ వంశీనే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Pawan Kalyan కి Covid పాజిటివ్, ఊపిరితిత్తుల్లో నిమ్ము, పూర్తి వివరాలు !!
కరోనా అనుభవం ఉండడంతో

కరోనా అనుభవం ఉండడంతో

నిజానికి గతంలో నాగ వంశీ కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది.. దీంతో కరోనా వచ్చినప్పుడు ఎలా ఉండాలి ? ఏమి చేయాలి ? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే అంశాలను పరిశీలించేందుకుగాను నాగ వంశీ కూడా పవన్ కళ్యాణ్ తో నే ఉన్నట్లు తెలుస్తోంది. నాగ వంశీ కూడా పవన్ తో పాటు ఆయన ఫాంహౌస్ లో ఉండి పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X